ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీదారు కంపెనీ అయిన మోటోరోలా ..తన సరికొత్త స్మార్ట్ ఫోన్ మోటరోలా ఎడ్జ్ 50 భారతదేశంలో లాంచ్ చేసింది. ఈ సిరీస్‌లో కంపెనీ ఇప్పటికే ఎడ్జ్ 50 అల్ట్రా, ఎడ్జ్ 50 ప్రో, ఎడ్జ్ 50 ఫ్యూజన్‌లను ఇండియాలో విడుదల చేసింది. ఈ Motorola ఫోన్ మిలిటరీ గ్రేడ్ బాడీ, IP68 రేటింగ్, అద్భుతమైన కెమెరా సెటప్‌తో వస్తుంది.
ప్రతీకాత్మక చిత్రం
Motorola భారత్ లో మరో బడ్జెట్ స్మార్ ఫోన్ 5జీని విడుదల చేసింది. Motorola ఈ ఫోన్ Edge 50 పేరుతో పరిచయం చేసింది. ఈ సిరీస్‌లో కంపెనీ ఇప్పటివరకు మోటరోలా ఎడ్జ్ 50 అల్ట్రా, మోటరోలా ఎడ్జ్ 50 ప్రో, మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్‌లను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ సిరీస్ ఈ ప్రామాణిక మోడల్ సోనీ లిటియా 700 ప్రైమరీ కెమెరా, IP68 రేటింగ్ వంటి గొప్ప ఫీచర్లతో వస్తుంది. Motorola నుంచి రిలీజ్ అయిన ఈ పవనర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్ గురించి తెలుసుకుందాం రండి.
ధర:
Motorola Edge 50 సింగిల్ స్టోరేజ్ వేరియంట్ 8GB RAM + 256GBలో లాంచ్ చేసింది. ఈ Motorola ఫోన్ ధర రూ.27,999. ఈ ఫోన్ మొదటి సేల్ ఆగస్టు 8న మధ్యాహ్నం 12 గంటలకు ఇ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్, కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది. ఫోన్ మొదటి సేల్‌లో వినియోగదారులు రూ. 2,000 వరకు బ్యాంక్ తగ్గింపును పొందవచ్చు. కాగా ఈ స్మార్ట్ ఫోన్ మూడు కలర్ ఆప్షన్లలో వస్తుంది. జంగిల్ గ్రీన్, పాంటోన్ పీచ్ ఫజ్, కోలా గ్రే.
డిస్ప్లే:
Edge 50లో, కంపెనీ 1.5K రిజల్యూషన్‌తో 6.7-అంగుళాల pOLED కర్వ్డ్ డిస్‌ప్లేను అందించింది. ఫోన్ డిస్ప్లే 120Hz అధిక రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. దీని డిస్‌ప్లే గరిష్ట ప్రకాశం 1,900 నిట్‌ల వరకు, HDR10+కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్‌లో కంపెనీ MIL-810H మిలిటరీ గ్రేడ్ చాలా సన్నని శరీరాన్ని ఉపయోగించింది.
వాటర్ రెసిస్టెంట్:
అంతేకాదు..ఈ కంపెనీ ఫోన్ డిస్‌ప్లేలో స్మార్ట్ వాటర్ టచ్ టెక్నాలజీని ఉపయోగించింది. మీ ఫోన్ నీటిలో తడిసినా పనిచేస్తుంది. ఫోన్ IP68 రేట్ చేయబడింది అంటే ఇది నీటిలో, దుమ్ము లేదా మట్టిలో మునిగిపోవడం వల్ల పాడైపోదు. మీరు దీన్ని కఠినమైన ఫోన్ లాగా ఉపయోగించవచ్చు.
The new #MotorolaEdge50 is designed to last. The camera is powered with Sony - LYTIA™ 700C Sensor, it can also withstand 7 rigorous MIL-STD 810H tests. Launched with 8+256GB at ₹25,999/-, sale starts 8 Aug @Flipkart, https://t.co/YA8qpSWDkw & leading stores#CraftedForTheBold
— Motorola India (@motorolaindia) August 1, 2024