ఈ రోజు సౌరవ్యవస్థ ఉన్న చోట అంతకుముందు వివిధ రకాల వాయువులు, ధూళి మేఘాలు ఉండేవి. శాస్త్రవేత్తల ప్రకారం ధూళి, మేఘాలకు దూరంగా మండుతున్న ఒక అగ్ని గోళం ఉండేది. అది అప్పుడే పుట్టిన ఒక నక్షత్రం.
ప్రతీకాత్మక చిత్రం
ఈ రోజు సౌరవ్యవస్థ ఉన్న చోట అంతకుముందు వివిధ రకాల వాయువులు, ధూళి మేఘాలు ఉండేవి. శాస్త్రవేత్తల ప్రకారం ధూళి, మేఘాలకు దూరంగా మండుతున్న ఒక అగ్ని గోళం ఉండేది. అది అప్పుడే పుట్టిన ఒక నక్షత్రం. ఆ నక్షత్రం చల్లబడటం ప్రారంభించింది. దాని కారణంగా ఆ నక్షత్రంలో భారీ పేలుడు జరిగింది. భారీ పేలుడు జరగడం వల్ల అంతరిక్షంలో ఉన్న దుమ్ము, ధూళి ఒక దగ్గరకు చేరుకున్నాయి. ఆ దమ్ము, ధూళిలో ఉన్న కణాలు ఒత్తిడి, ఉష్ణోగ్రత కారణంగా పెద్ద ఉలకలు, పెద్ద రాళ్లు ఏర్పడ్డాయి. ఇదే ఒత్తిడి కారణంగా ఆ ధూళి.. మేఘాలలో స్థిరంగా ఉన్న రేడియో యాక్టివ్ పదార్థం గ్రావిటీని నిర్మించింది. ఈ గ్రావిటీ కారణంగా హైడ్రోజన్, హీలియం పేరుకుపోవడం ప్రారంభించాయి. హీలియం, హైడ్రోజన్ మధ్యలో పేరుకుపోవడం వల్ల ఒత్తిడి అధికమై మధ్యలో ఒక విస్ఫోటనం జరిగింది. ఆ విస్ఫోటనం కారణంగా మన సూర్యుని జననం జరిగింది.
అంతరిక్షంలో విస్తరించిన గ్రహశకలాలు భారీ బరువు కారణంగా అవి సూర్యునికి దగ్గరగా వచ్చి సూర్యుని చుట్టూ తిరగడం ప్రారంభించాయి. ఆ గ్రహశకలాలు ఒకదానికి ఒకటి ఢీకొట్టి చిన్న చిన్న గ్రహశకలాలుగా మారి నిరంతరం పరిభ్రవించడం వల్ల మెర్య్కూరీ, వీనస్, ఎర్త్, మార్స్ వంటి గ్రహాల నిర్మాణం జరిగింది. శాస్త్రవేత్తల ప్రకారం ఆ సమయంలో భూమి, అంగారకుడి మధ్య థీయా అనే ఒక గ్రహం కూడా ఉండేది. భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉండటం వల్ల సూర్యుని చుట్టూ తిరిగే గ్రహశకలాలు భూమి చుట్టూ తిరగడం మొదలుపెట్టాయి. తర్వాత ఆ గ్రహశకలాలు మెల్లి మెల్లిగా కొన్ని కోట్ల సంవత్సరాల వరకు భూమిపై పడుతూ ఉండేవి. భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉండటం వల్ల థీయా కూడా అతి దగ్గర రావడం మొదలైంది.
అలా వస్తూ వస్తూ ఒక్కసారిగా మన భూమిని ఢీకొట్టింది. భూమిని థీయా ఢీకొట్టడం వల్ల భూమి ఇసుక రాళ్లలా విచ్ఛిన్నమైంది. భూమి నుంచి విచ్ఛిన్నమైన సగభాగం రింగ్స్ లాగా భూమి చుట్టూ తిరగడం ప్రారంభించింది. అలా తిరుగుతూ తిరుగుతూ ఒకదానికొకటి ఢీకొట్టడం ద్వారా చంద్రుడి నిర్మాణం జరిగింది. ఆ సమయంలో మన భూమిపై ఒకటే సముద్రం ఉండేది. అది 1,900 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో ఉడికిపోతున్న లావా. అంత ఉష్ణోగ్రతతో ఉన్న లావా కాలం మారుతున్న కొద్దీ మంచుగా మారుతూ.. భూమి కోర్ భాగం వద్ద చేరింది. ఆ సమయంలో భూమి మొత్తం నీటితో నిండి ఉంది. కొన్ని వేల డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్‌తో ఉన్న అగ్ని పర్వాతాలు ఉప్పు నీటి సముద్రాలుగా ఏర్పడ్డాయి. రాబోయే కొన్ని లక్షల సంవత్సరాల వరకు ఈ అగ్ని పర్వతాలు పేలుతూనే ఉన్నాయి. ఆ అగ్ని పర్వతాలే పేలి బయటకు వచ్చిన లావా ఆ సముద్రాలపై పడ్డాయి.