ప్రస్తుతం ఏం నడుస్తోంది..? అంటే గిబ్లీ Ghibli ఫొటోల హవా నడుస్తోందని చెప్పాలి. గిబ్లీ ఫొటోలతో సోషల్ మీడియా హోరెత్తుతోంది. ప్రముఖ ఏఐ ఇంజిన్ చాట్ జీపీటీ chatgpt తీసుకొచ్చిన ఈ సదుపాయాన్ని వినియోగించుకుంటూ వినియోగదారులు మైమరచిపోతున్నారు.
గిబ్లీ స్టైల్ ఇమేజ్
ఈవార్తలు, టెక్ న్యూస్ : ప్రస్తుతం ఏం నడుస్తోంది..? అంటే గిబ్లీ Ghibli ఫొటోల హవా నడుస్తోందని చెప్పాలి. గిబ్లీ ఫొటోలతో సోషల్ మీడియా హోరెత్తుతోంది. ప్రముఖ ఏఐ ఇంజిన్ చాట్ జీపీటీ chatgpt తీసుకొచ్చిన ఈ సదుపాయాన్ని వినియోగించుకుంటూ వినియోగదారులు మైమరచిపోతున్నారు. ఫేస్‌బుక్ facebook, ఇన్‌స్టాగ్రామ్ instagram, ట్విట్టర్ twitter, వాట్సాప్ whatsapp.. ఇలా ఏ సోషల్ మీడియా ఓపెన్ చేసినా, ప్రతి చోటా గిబ్లీ ఫొటోలే దర్శనమిస్తున్నాయి. దీని వినియోగం చూసి చాట్ జీపీటీ తల పట్టుకుంటోంది. దయచేసి గిబ్లీ ఫొటోల తయారీ వాడకాన్ని తగ్గించాలని చాట్ జీపీటీ సీఈవో వేడుకుంటున్నారు. అయితే, చాలా మందికి ఈ గిబ్లీ ఫొటోలు ఎలా తయారు చేసుకోవాలో తెలియడం లేదు. అలాంటి వారు ఈ సింపుల్ స్టెప్స్ ద్వారా గిబ్లీ ఫొటోలు పొందవచ్చు.
గిబ్లీ ఫొటోలు పొందేందుకు..
- ముందుగా చాట్ జీపీటీ chat.openai.com వెబ్‌సైట్ ఓపెన్ చేసి, లాగిన్ కావాలి.
- అనంతరం GPT-40 ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
- సెర్చ్ బాక్సులో (+) ఐకాన్‌పై క్లిక్ చేసి ఫొటోను అప్‌లోడ్ చేయాలి
- ఫొటో అప్‌లోడ్ అయ్యాక Create ghibli photo అని టైప్ చేస్తే సరిపోతుంది.
- మీరు అప్‌లోడ్ చేసిన ఫొటోను అనలైజ్ చేసి.. క్షణాల్లో అద్భుతమైన గిబ్లీ ఇమేజ్ అందిస్తుంది.
- ఆ ఫొటోను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేదా.. షేర్ చేసుకోవచ్చు.
- గిబ్లీ స్టైల్ ఫొటో నచ్చకపోతే మీకు అవసరమైన సూచనలు అందించి మళ్లీ గిబ్లీ ఫొటో అందించాలని కోరవచ్చు.