Google Pixel 8A : అనుకున్న సమయానికన్నా గూగుల్ పిక్సెల్ 8ఏ ఫోన్ Google pixel 8a ను ముందే ఫోన్‌ను విడుదల చేసి.. వినియోగదారులను ఆశ్చర్యంలో ముంచెత్తింది.
ఈవార్తలు, టెక్ న్యూస్: గూగుల్ మరో కొత్త ఫోన్‌ను భారత మార్కెట్లో ఆవిష్కరించింది. అనుకున్న సమయానికన్నా గూగుల్ పిక్సెల్ 8ఏ ఫోన్ Google pixel 8a ను ముందే ఫోన్‌ను విడుదల చేసి.. వినియోగదారులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. బిల్ట్ ఇన్ జెమినీ ఏఐ అసిస్టెన్స్ సహా ఇతర ఏఐ ఫీచర్లు దీనిలో జోడించారు. గూగుల్ పిక్సెల్ 7ఏ మాదిరే దీని డిజైన్ కూడా ఉండనుంది. అయితే దానికన్నా గూగుల్ పిక్సెల్ 8ఏ ఫోన్ 40 శాతం బ్రైట్‌గా ఉంటుంది.
గూగుల్ పిక్సెల్ 8ఏ ఫీచర్లు ఇవీ..
- 1080 x 2400 రిజొల్యూషన్.. 430పీపీఐ
- 6.1 అంగుళాల ఓఎల్‌ఈడీ యాక్చువా డిస్‌ప్లే
- 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్.. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్
- 2000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్
- 16 మిలియన్ల కలర్స్ వచ్చేలా ఫుల్ 24-బిట్ డెప్త్.. పంచ్ హోల్ డిస్ ప్లే
- మ్యాట్ ఫినిషింగ్ పాలిటిష్డ్ అల్యూమీనియం ఫ్రేమ్ బ్యాక్ ప్యానెల్
- గూగుల్ టెన్సర్ జీ3 చిప్ సెట్
- టైటాన్ ఎం2 సెక్యూరిటీ కో ప్రాసెసర్
- డ్యుయల్ రేర్ కెమెరా సెటప్
- 64-మెగా పిక్సెల్ మెయిన్ లెన్స్ కెమెరా, 13-మెగా పిక్సెల్ ఆల్ట్రావైడ్ లెన్స్ కెమెరా, (లార్జ్ ఫీల్డ్ ఆఫ్ వ్యూ)
- సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 13-మెగా పిక్సెల్స్ ఫ్రంట్ కెమెరా
- టైప్-సీ చార్జర్.. 4,492 ఎంఏహెచ్ కెపాసిటీ బ్యాటరీ
- వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ ఐపీ67 రేటింగ్
- ఆండ్రాయిడ్ 14.. 7 ఇయర్స్ ఓఎస్ అప్‌డేట్స్
కలర్లు: అలోయ్, బే, ఒబ్సిడియన్, పోర్సెలియన్
వేరియంట్లు: 128 జీబీ, 256 జీబీ స్టోరేజీ
ధర: 128 జీబీ స్టోరేజీ (రూ.52,999),
256 జీబీ స్టోరేజీ (రూ.59,999)
(డిస్కౌంట్: ఎస్బీఐ కార్డుపై రూ.4 వేల తగ్గింపు)