Google Gemini | భారత్‌లో గూగుల్ జెమిని విడుదల.. 9 భాషల్లో అందుబాటులోకి..

Google Gemini | గత ఏడాది చివరిలోనే లాంచ్ చేసిన జెమిని ఏఐని తాజాగా భారత్‌లో లాంచ్ చేసింది. అనేక ఫీచర్లు, అత్యంత అడ్వాన్స్‌డ్ అయిన ఈ ఏఐ టూల్.. ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది.

google gemini

గూగుల్ జెమిని

టెక్ న్యూస్, ఈవార్తలు :  చాట్ జీపీటీ తరహాలో గూగుల్ సరికొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్‌ను భారత్‌లో అందుబాటులోకి తెచ్చింది. గత ఏడాది చివరిలోనే లాంచ్ చేసిన జెమిని ఏఐని తాజాగా భారత్‌లో లాంచ్ చేసింది. అనేక ఫీచర్లు, అత్యంత అడ్వాన్స్‌డ్ అయిన ఈ ఏఐ టూల్.. ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది. దీన్ని భారతీయ భాషలకు అనుగుణంగా రూపొందించారు. 9 ప్రాంతీయ భాషల్లో పనిచేసేలా దీన్ని అభివృద్ధి చేశారు. ఈ మేరకు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తన ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. ‘జెమినిలో ప్రాంతీయ భాషలను అందుబాటులోకి తెచ్చాం. గూగుల్ మెసేజెస్‌లోనూ దీన్ని యూజ్ చేసుకోవచ్చు. రాబోయే రోజుల్లో మరిన్ని ఫీచర్లను జోడిస్తాం’ అని వెల్లడించారు.

తెలుగుతో సహా తమిళం, హిందీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఉర్దూ భాషల్లో గూగుల్ జెమిని సేవలను వాడుకోవచ్చు. టైప్, వాయిస్ అసిస్టెంట్ ద్వారా జెమినిలో సెర్చ్ చేయవచ్చు. ఫొటో సాయంతోనూ దేన్నైనా వెతికే అవకాశం ఇందులో ఉంది. ప్రస్తుతానికి ఈ యాప్ ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉందని గూగుల్ ఒక ప్రకటనలో తెలిపింది. రాబోయే రోజుల్లో ఐఫోన్ యూజర్ల కోసం కూడా రూపొందిస్తామని వెల్లడించింది. జెమినిలో ప్రీమియం సేవలు పొందేందుకు జెమిని అడ్వాన్స్ తీసుకొచ్చినట్టు వివరించింది. దీనికి కొత్త డబ్బు చెల్లించాలని స్పష్టం చేసింది. ఫైల్ అప్‌లోడ్, డాటా అనలైజ్ వంటి సేవలు ప్రీమియంలో పొందవచ్చని పేర్కొంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్