గిబ్లీ ఫొటోల కోసం ChatGPTలో ఫొటోను అప్‌లోడ్ చేస్తున్నారా.. జాగ్రత్త అని హెచ్చరిస్తున్న సైబర్ నిపుణులు

Ghibli ఫొటోలతో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. ఎక్కడ చూసినా ఆ ఫొటోలే దర్శనమిస్తున్నాయి. chatgpt, grok వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫాంలలో తమ ఫొటోలను అప్‌లోడ్ చేస్తూ గిబ్లీ ఫొటోలను పొందుతున్నారు

ghibli image chatgpt

ప్రతీకాత్మక చిత్రం

ఈవార్తలు, టెక్ న్యూస్ : Ghibli ఫొటోలతో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. ఎక్కడ చూసినా ఆ ఫొటోలే దర్శనమిస్తున్నాయి. chatgpt, grok వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫాంలలో తమ ఫొటోలను అప్‌లోడ్ చేస్తూ గిబ్లీ ఫొటోలను పొందుతున్నారు చూడ్డానికి ఆకర్షనీయంగా, క్షణాల్లోనే కావాల్సిన విధంగా ఫొటోలు రావడంతో ప్రతి ఒక్కరు తమ ఫొటోలను అప్‌లోడ్ చేస్తున్నారు. అయితే, ఇది అత్యంత ప్రమాదకరం అని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. గిబ్లీ ఫొటోల కోసం తమ ఫొటోలను అప్‌లోడ్ చేయడం వల్ల ఆ ఫొటోల్లోని ముఖ కవలికలను ఏఐ సేవ్ చేసుకుంటుందని వివరిస్తున్నారు. అది మన ప్రమేయం లేకుండానే ఫేషియల్ డాటాను కృత్రిమమేధ వాడుకునే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. ముఖ్యంగా వ్యక్తిగత ఫొటోలు పెట్టడం వల్ల సమస్యలు తప్పవని చెప్తున్నారు. ఓపెన్ ఏఐ ఆ డాటాను షేర్ చేసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

గిబ్లీ ఫొటోల వినియోగాన్ని తగ్గిస్తేనే మంచిదని, ఓపెన్ ఏఐని వ్యక్తిగత జీవితంలోకి తేవడం మంచిది కాదని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. మహిళలు, చిన్న పిల్లల ఫొటోల డాటాను ఓపెన్ ఏఐ సేవ్ చేసుకుంటే.. ఎవరైనా దాన్ని తప్పుడుగా వినియోగించే అవకాశం లేకపోలేదని అంటున్నారు. ఆ ఫొటోలు సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కితే సైబర్ ప్రమాదాలు పొంచి ఉంటాయని తెలుపుతున్నారు. కాబట్టి ఓపెన్ ఏఐలో ఫొటోలు అప్‌లోడ్ చేయడం మానుకోవాలని సూచిస్తున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్