మీరు డిప్లొమా, టెక్నికల్ డిగ్రీ, నాన్-టెక్నికల్ డిగ్రీ పూర్తి చేసి మంచి ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే మీకూ గుడ్ న్యూస్. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ 52 అప్రెంటీస్ ట్రైనర్ల రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోండి.
ప్రతీకాత్మక చిత్రం
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ.. వెహికల్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ అవసరమైన అప్రెంటిస్ పోస్టుల భర్తీకి రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. డిప్లొమా, ఇంజినీరింగ్‌తోపాటు జనరల్ స్ట్రీమ్ గ్రాడ్యుయేట్లు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి.మెకానికల్, ఎలక్ట్రికల్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సబ్జెక్టులు, జనరల్ స్ట్రీమ్ గ్రాడ్యుయేట్ సబ్జెక్టులలో కూడా అప్రెంటిస్ పోస్టులను రిక్రూట్ చేస్తారు. సబ్జెక్ట్ / బ్రాంచ్ వారీగా పోస్ట్‌ల వివరాలను క్రింద చూడండి.
డిప్లొమా అప్రెంటిస్ పోస్టులు:
మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా: 11
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా: 2
ఆటోమొబైల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా: 2
డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్: 2
డిప్లొమా ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్: 3
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులు:
మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ: 10
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ: 3
ఆటోమొబైల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ: 2
ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ: 5
కంప్యూటర్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ: 3
జనరల్ స్ట్రీమ్‌లో డిగ్రీ: 09
విద్యార్హత వివరాలు:
డిప్లొమా అప్రెంటీస్: సంబంధిత బ్రాంచ్‌లలో ఇంజినీరింగ్‌లో డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
గ్రాడ్యుయేట్ అప్రెంటీస్: పోస్టుకు సంబంధించిన సబ్జెక్టులో టెక్నికల్ లేదా నాన్ టెక్నికల్ డిగ్రీ ఉండాలి.
నెలవారీ స్టైపెండ్ వివరాలు
డిప్లొమా అప్రెంటీస్ : రూ.8000.
గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ : రూ.9000.
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ముఖ్యమైన తేదీలు
ప్రారంభ తేదీ: 12-08-2024
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: 31-08-2024
ఎలా దరఖాస్తు చేయాలి?
NATS పోర్టల్‌ని సందర్శించడం ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించాలి. దరఖాస్తు చేయడానికి https://nats.education.gov.in/student_register.php వెబ్ చిరునామాను సందర్శించి..రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. దరఖాస్తు చేయడానికి ఆధార్ కార్డ్, ఇమెయిల్ చిరునామా, మొబైల్ నంబర్, పాస్‌పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్, ఆధార్ లింక్డ్ బ్యాంక్ అకౌంట్ నంబర్, డిప్లొమా/డిగ్రీ మార్క్‌షీట్ పీడీఎఫ్, బ్యాంక్ పాస్‌బుక్ మొదటి పేజీ పీడీఎఫ్ అవసరం. ఈ సమాచారం అంతా సిద్ధం చేసి దరఖాస్తును సమర్పించాలి.