సైబర్ నేరాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఐఫోన్ యూజర్లకు యాపిల్ కంపెనీ సంస్థ కీలక జాగ్రత్తలు సూచించింది. ఎప్పటికప్పుడు కంపెనీ అందించే సెక్యూరిటీ అప్‌డేట్స్ చెక్ చేసుకుంటూ ఉండాలని తెలిపింది.
ప్రతీకాత్మక చిత్రం
న్యూయార్క్ : సైబర్ నేరాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఐఫోన్ యూజర్లకు యాపిల్ కంపెనీ సంస్థ కీలక జాగ్రత్తలు సూచించింది. ఎప్పటికప్పుడు కంపెనీ అందించే సెక్యూరిటీ అప్‌డేట్స్ చెక్ చేసుకుంటూ ఉండాలని తెలిపింది.
యాపిల్ యూజర్లకు జాగ్రత్తలు ఇవీ..
1. ఫ్రాడ్ ఈమెయిల్స్‌ను గుర్తించేందుకు ఏ మెయిల్ ఐడీ నుంచి మెయిల్ వచ్చిందనేది జాగ్రత్తగా పరీక్షించాలి.
2. ఎలాంటి పాప్ అప్ యాడ్స్‌పై క్లిక్ చేయొద్దు. ముఖ్యంగా మీ ఫోన్‌లో సెక్యూరిటీ సమస్య ఉందంటూ వచ్చే సందేశాలను పట్టించుకోవద్దు.
3. యాపిల్ సపోర్ట్ ఒరిజినలా, కాదా అన్నది చూసుకోవాలి. సందేశాలపై అప్రమత్తంగా ఉండాలి.
4. ఉచిత బహుమతులు వచ్చాయంటూ వచ్చే ప్రకటనలు ఎట్టిపరిస్థితుల్లోనూ నమ్మి మోసపోవద్దు.
5. అపరిచితుల నుంచి వచ్చే క్యాలెండర్ ఇన్ వైట్లను తిరస్కరించాలి. తెలియని వెబ్‌సైట్లలో పాస్వర్డులు, సెక్యూరిటీ కోడ్స్ ఎంటర్ చేయవద్దు.
6. యాపిల్ ఐడీకి 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ పెట్టుకోవాలి. దాంతో మీ ఫోన్‌కు వ్యక్తిగత భద్రత ఉంటుంది. కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవాలి.