భూమ్మీద మొట్టమొదటిసారి వ్యవసాయం చేసింది మనుషులు కాదట.. ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

భూమ్మీద మనిషికి తప్ప ఏ జీవికీ వ్యవసాయం చేయడం రాదని మనకు తెలుసు. కానీ, మనుషుల కంటే ముందే, 6.6 కోట్ల సంవత్సరాల కిందటే ఓ జీవి వ్యవసాయాన్ని చేసిందట. ఆ జీవి ఏమిటంటే.. చీమ. చీమ వ్యవసాయం చేయడం ఏంటి? అనుకుంటున్నారా?

agriculture

ప్రతీకాత్మక చిత్రం

న్యూయార్క్: భూమ్మీద మనిషికి తప్ప ఏ జీవికీ వ్యవసాయం చేయడం రాదని మనకు తెలుసు. కానీ, మనుషుల కంటే ముందే, 6.6 కోట్ల సంవత్సరాల కిందటే ఓ జీవి వ్యవసాయాన్ని చేసిందట. ఆ జీవి ఏమిటంటే.. చీమ. చీమ వ్యవసాయం చేయడం ఏంటి? అనుకుంటున్నారా? గడ్డపారలతో తవ్వి, పారలతో తోడి, నీళ్లు పారించి, విత్తనాలు వేసి సాగు చేస్తేనే వ్యవసాయం అన్నట్టు కాదు.. ఏ విధంగా ఆహారాన్ని ఉత్పత్తి చేసినా అది సాగు కిందే లెక్క. అలా చీమ భూమ్మీద మొట్టమొదటిసారి వ్యవసాయం చేసిందని అమెరికాకు చెందిన స్మిత్ సోనియన్స్ నేషనల్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ శాస్త్రవేత్తలు తేల్చారు. అసలేం జరిగిందంటే.. 6.6 కోట్ల సంవత్సరాల క్రితం వరకు భూమిపై డైనోసార్లు జీవించేవి. విశ్వంలో సంభవించిన ఓ సంఘటన వల్ల ఓ భారీ గ్రహశకలం భూమిని ఢీకొట్టింది. దాని దెబ్బకు అనేక డైనోసార్లు మరణించాయి. అదే సమయంలో ఆస్టరాయిడ్ ఢీకొట్టడంతో గాలిలోకి దుమ్ము, ధూళి చేరింది. ఆ దుమ్ము, ధూళి.. సూర్యకాంతిని భూమ్మీదకు చేరకుండా అడ్డుకున్నాయి.

సూర్యరశ్మి భూమ్మీదకు చేరకపోవడంతో కిరణ జన్య సంయోగ క్రియ జరగలేదు. దాంతో వాతావరణ మార్పులు జరిగి.. ఆహారం దొరక్కపోవడంతో అనేక జీవరాశులు మరణించాయి. ఆ సమయంలోనే చీమలు ఆహారాన్ని సంపాదించుకోవడానికి వ్యవసాయం చేయడం మొదలుపెట్టాయని పరిశోధకులు వివరించారు. ‘కిరణజన్య సంయోగ క్రియ జరగకపోవడంతో మొక్కలన్నీ చనిపోయే స్థితికి చేరాయి. చీమలకు కూడా ఆహారం దొరకలేదు. దీంతో మొక్కల ఆకుల్లోని కొంత భాగాన్ని కత్తిరించి.. చీమల పుట్టలోకి తీసుకెళ్లి భద్రపర్చుకున్నాయి. కొంతకాలం అలాగే ఉంచేసరికి ఆకుల భాగంపై శిలీంద్రాలు ఏర్పడ్డాయి. ఆ శిలీంద్రాలను చీమలు ఆహారంగా తీసుకొన్నాయి’ అని శాస్త్రవేత్తలు వెల్లడించారు. అమెరికా, కరేబియన్ దీవుల్లోని 250 రకాల చీమల జాతులు ఇప్పటికీ ఇలాంటి వ్యవసాయమే చేస్తున్నాయని తెలిపారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్