నిరుద్యోగులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. పదవ తరగతి, ఇంటర్, ఐటిఐ అర్హతతోనే ఉద్యోగాల అవకాశాన్ని కల్పించింది. రైల్వే డిపార్ట్‌మెంట్‌కి సంబంధించిన నార్త్ వెస్ట్రన్ రైల్వే, నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే జోన్ల నుంచి 7438 ఉద్యోగాలకు సంబంధించి ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేసింది రైల్వే శాఖ.
ప్రతీకాత్మక చిత్రం
నిరుద్యోగులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. పదవ తరగతి, ఇంటర్, ఐటిఐ అర్హతతోనే ఉద్యోగాల అవకాశాన్ని కల్పించింది. రైల్వే డిపార్ట్‌మెంట్‌కి సంబంధించిన నార్త్ వెస్ట్రన్ రైల్వే, నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే జోన్ల నుంచి 7438 ఉద్యోగాలకు సంబంధించి ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేసింది రైల్వే శాఖ. కనీసం 15 నుంచి 24 సంవత్సరాల వయసుగల వారు ఆప్లై చేసుకోవచ్చు. ఎలాంటి రాతపరీక్ష లేకుండానే మెరిట్ మార్కుల ఆధారంగా చేసుకుని ఉద్యోగానికి సెలక్షన్ చేయటం జరుగుతుందని Railway Recruitment Cell-North Western Railway (NWR) వెల్లడించింది.
ఖాళీలు:
రైల్వే శాఖ జారీ చేసిన 7438 ఉద్యోగాలు అఫీషియల్‌గా అప్రెంటిస్ విధానంలో విడుదల చేశారు. ముందుగా ట్రైనింగ్ ఇచ్చి తర్వాత సర్టిఫికెట్ జారీ చేస్తారు. పూర్తిగా మీకు గవర్నమెంట్ జాబ్ ఇవ్వరు కానీ గవర్నమెంట్ జాబ్‌కి ఉపయోగపడే అప్రెంటిస్ సర్టిఫికెట్ ఇస్తారు. ఆర్.ఆర్.సి ఉద్యోగానికి సంబంధించి వయసు 15 సంవత్సరాల నుండి 24 సంవత్సరాలు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాల మినహాయింపు ఉంటుంది. ఆర్.ఆర్.సి ఉద్యోగానికి పదవ తరగతి, ఇంటర్, ఐటిఐ ఉత్తీర్ణులు అయి ఉండాలి. మీరు ఉద్యోగంలో చేరగానే 15,000 జీతం అందుతుంది. ట్రైనింగ్ సమయంలో కూడా కొంత డబ్బు ఇస్తారు. అప్లికేషన్‌కు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళలకు ఫీజు ఉండదు. మిగతావారికి రూ.100 చెల్లించాలి. నవంబర్ 10వ తేది నుంచి డిసెంబర్ 10లోగా అప్లై చేసుకోవచ్చు. Railway Department- RRC OFFICIAL WEBSITE లోకి వెళ్లి వివరాలు నమోదు చేయాలి.
నోటిఫికేషన్ తేదీలు
అప్లికేషన్ ప్రారంభ తేది నవంబర్ 10
చివరి తేది డిసెంబర్ 10