ఉమ్మడి ఎనిమిది జిల్లాల్లో ఖాతా తెరవని వైసిపి.. రాయలసీమలో ఏడు స్థానాలే

రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనేక జిల్లాల్లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఉమ్మడి 13 జిల్లాల్లో ఎనిమిది జిల్లాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఖాతా కూడా తెరవని పరిస్థితి ఏర్పడింది.

alliance

కూటమి 


రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనేక జిల్లాల్లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఉమ్మడి 13 జిల్లాల్లో ఎనిమిది జిల్లాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఖాతా కూడా తెరవని పరిస్థితి ఏర్పడింది. జిల్లాల వారీగా వైసిపికి వచ్చిన ఓట్లను జిల్లాల వారీగా వైసిపికి వచ్చిన సీట్లను పరిశీలిస్తే.. శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణ, గుంటూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాలో వైసిపి ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది. విశాఖపట్నం జిల్లాల్లో 15 స్థానాలకు గాను రెండు స్థానాల్లో, ప్రకాశం జిల్లాలో 12 స్థానాలకుగాను రెండు స్థానాల్లో, కడప జిల్లాలో పది స్థానాలకుగాను మూడు స్థానాల్లో, కర్నూలు జిల్లాలో 14 స్థానాలకుగాను రెండు స్థానాల్లో, చిత్తూరు జిల్లాలో 14 స్థానాలకుగాను రెండు స్థానాల్లో వైసిపి అభ్యర్థులు విజయాన్ని నమోదు చేశారు. ఒక్క నిమిషం 2019 సార్వత్రిక ఎన్నికల్లో 151 స్థానాల్లో గెలిచిన వైసీపీ 140 స్థానాలను కోల్పోయి 11 స్థానాలకు పరిమితమైంది, గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో ఒకే ఒక్క స్థానంలో విజయం సాధించిన జనసేన పార్టీ.. తాజా ఎన్నికల్లో పోటీ చేసిన 21 స్థానాల్లోనూ విజయ బావుటా ఎగరవేసింది. బీజేపీ పోటీ చేసిన ఎనిమిది స్థానాల్లో విజయం సాధించగా, టిడిపి పోటీ చేసిన 144 స్థానాల్లో 11 స్థానాల్లో మాత్రమే పరాభవం చెంది 133 స్థానాల్లో విజయం సాధించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రాయలసీమ జిల్లాల్లో వైసీపీకి ఈసారి ఘోర పరాజయం దక్కింది. ఉమ్మడి రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో 52 స్థానాలు ఉండగా వైసిపి ఏడు స్థానాలు మాత్రమే దక్కించుకుంది. కూటమి అభ్యర్థులు 45 స్థానాల్లో విజయ బావుటా ఎగురవేశారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్