కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మధ్య ట్విట్టర్ వేదికగా వార్ నడుస్తోంది. వీరి మధ్య వార్‌కు ఆరోగ్య శ్రీ పథకం కారణమైంది. వివరాల్లోకి వెళితే.. రెండు రోజులు కిందట మీడియాతో మాట్లాడిన కేంద్ర మంద్రి పెమ్మసాని చంద్రశేఖర్.. ఆయుష్మాన్ భారత్ కార్డులను రాష్ట్రంలోని ప్రజలంతా తీసుకోవాలన సూచించారు. ఆరోగ్య శ్రీ కార్డులు మాదిరిగానే ఆయుష్మాన్ భారత్ కార్డులను వినియోగించుకోవచ్చన్నారు. దీనివల్ల ఆస్పత్రులు బాగుండడంతోపాటు ఆరోగ్యం బాగుంటుందన్నారు. ఆరోగ్య శ్రీ పథకానికి డబ్బులు లేని పరిస్థితి ఏర్పడిందని, ఆస్పత్రులకు బిల్లులు కూడా రావడం లేదన్నారు.
వైఎస్ షర్మిలారెడ్డి, పెమ్మసాని చంద్రశేఖర్
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మధ్య ట్విట్టర్ వేదికగా వార్ నడుస్తోంది. వీరి మధ్య వార్‌కు ఆరోగ్య శ్రీ పథకం కారణమైంది. వివరాల్లోకి వెళితే.. రెండు రోజులు కిందట మీడియాతో మాట్లాడిన కేంద్ర మంద్రి పెమ్మసాని చంద్రశేఖర్.. ఆయుష్మాన్ భారత్ కార్డులను రాష్ట్రంలోని ప్రజలంతా తీసుకోవాలన సూచించారు. ఆరోగ్య శ్రీ కార్డులు మాదిరిగానే ఆయుష్మాన్ భారత్ కార్డులను వినియోగించుకోవచ్చన్నారు. దీనివల్ల ఆస్పత్రులు బాగుండడంతోపాటు ఆరోగ్యం బాగుంటుందన్నారు. ఆరోగ్య శ్రీ పథకానికి డబ్బులు లేని పరిస్థితి ఏర్పడిందని, ఆస్పత్రులకు బిల్లులు కూడా రావడం లేదన్నారు. రోగులు వెళితే వైద్యం జరగని పరిస్థితి ఏర్పడిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఐదు లక్షల రూపాయల నిధులను అందిస్తోందని, పేదవాళ్లు దీన్ని వినియోగించుకోవాలని సూచించారు. దీనివల్ల ఆస్పత్రులు ఇబ్బందులు పడవని, రాష్ట్ర ప్రభుత్వానికి భారం తగ్గుతుందన్నారు. రోగులకు నాణ్యమైన వైద్యం అందుతుందని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య శ్రీ పథకాన్ని అమలు చేయాలని భావించడం లేదా..? అని ప్రశ్నించారు. ఆయుష్మాన్ భారత్ పథకమే ఇక రాష్ట్రంలో అమలు చేయాలని భావిస్తున్నారా..? అని ప్రశ్నించిన షర్మిల.. కూటమి ప్రభుత్వానికి ఆరోగ్య శ్రీ పథకాన్ని నిలిపివేసే ఆలోచన ఉందా..? అని నిలదీశారు. అందుకే పెండింగ్ బకాయిలు చెల్లించేందుకు జాప్యం చేస్తున్నారా..? అని ప్రశ్నించారు. షర్మిల వ్యాఖ్యలపై మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
ఏపీ ప్రజలను షర్మిల దారి మళ్లించేందుకు చేస్తున్న ప్రయత్నాలను ఖండిస్తున్నట్టు ప్రకటించారు. ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ పథకం ఆరోగ్య శ్రీ పథకానికి ప్రత్యామ్నాయం కాదని స్పష్టం చేశారు. ప్రజలకు వైద్య సేవలను విస్తరించేందుకు తీసుకువచ్చిన పథకంగా స్పష్టం చేశారు. కాంగ్రెస్ రాజకీయ పూరిత కుట్రలకు బలి కావద్దని ఏపీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చేసిన ట్వీట్ షర్మిల తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ మరో ట్వీట్ చేశారు. తాను ప్రజలను పక్కదారి పట్టించేందుకు మాట్లాడి ఉంటే మిమ్మల్ని ఎందుకు సమాధానం చెప్పాలని అడుతానని స్పష్టం చేశారు. మీడియా సమావేశంలో మంత్రి మాటలపై ప్రజలకు అనుమానాలు తలెత్తాయని, తమ దృష్టికి రావడంతోనే స్పందించి ప్రజలకు స్పష్టత ఇవ్వాలని కోరినట్టు స్పష్టం చేశారు. రాష్ట్రంలో అధికార పార్టీకి చెందిన నేతగా ఆరోగ్య శ్రీ పథకానికి డబ్బులు లేవని చెప్పడం ఏమిటని, ఆస్పత్రులకు డబ్బులు రావడం లేదని, పేషెంట్లకు వైద్యం అందడం లేదని చెప్పడం దేనికి సంకేతమని ఆమె ప్రశ్నించారు. అందుకే ప్రతి ఒక్కరూ ఆయుష్మాన్ భారత్ కార్డులు తీసుకోండి అంటూ మంత్రి కోరడం వల్లే ఆరోగ్య శ్రీ పథకం కొనసాగింపుపై అనుమానాలు వ్యక్తమైనట్టు ఆమె వెల్లడించారు. ప్రభుత్వాన్ని నడిపేవాళ్లు బాధ్యతారాహిత్యమైన కామెంట్స్ చేయొచ్చా..? అని ఆమె నిలదీశారు. మీరు చేసిన వ్యాఖ్యలను మీ విజ్ఞతకే వదిలేస్తున్నట్టు స్పష్టం చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆరోగ్య శ్రీని.. అనారోగ్య శ్రీ చేయకుండా పూర్తిస్థాయిలో నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు ప్రతి ఒక్కరికీ రూ.25 లక్షలు హెల్త్ ఇన్సురెన్స్ అందిస్తామని చెప్పిన ఎన్‌డీఏ కూటమి.. ఎప్పటిలోగా అమలు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు.