వచ్చే నెల మూడో తేదీన లండన్ కు వెళ్ళనున్న వైఎస్ జగన్.. 25 వరకు అక్కడే

వైసిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే నెల మూడో తేదీన లండన్ పర్యటనకు వెళ్ళనున్నారు. ఆయనతోపాటు భార్య భారతి కూడా లండన్ టూర్ కు వెళుతున్నారు. ఈ మేరకు మూడు రోజుల కిందట సిబిఐ కోర్టు జగన్ మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు అనుమతి ఇచ్చింది. అయితే జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటన ప్రస్తుతం ఆసక్తిని కలిగిస్తోంది.

Jaganmohan Reddy and his wife Bharti

 జగన్మోహన్ రెడ్డి, భార్య భారతి

వైసిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే నెల మూడో తేదీన లండన్ పర్యటనకు వెళ్ళనున్నారు. ఆయనతోపాటు భార్య భారతి కూడా లండన్ టూర్ కు వెళుతున్నారు. ఈ మేరకు మూడు రోజుల కిందట సిబిఐ కోర్టు జగన్ మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు అనుమతి ఇచ్చింది. అయితే జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటన ప్రస్తుతం ఆసక్తిని కలిగిస్తోంది. వచ్చే నెల మూడో తేదీ నుంచి 25వ తేదీ వరకు జగన్మోహన్ రెడ్డి లండన్ లో ఉండనున్నారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి తన కుమార్తె పుట్టినరోజు వేడుకల్లో భాగంగా లండన్ కు వెళుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే అంతర్గతంగా ఆయన పర్యటన వెనుక అనేక కారణాలు ఉన్నట్లు చెబుతున్నారు. ఈవీఎం వ్యవహారాలపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. మొన్న జరిగిన ఎన్నికల్లో ఈవీఎం ట్యాంపరింగ్ చేయడం వల్లే అనేక చోట్ల బిజెపి దాని మిత్రపక్షాలు లాభ పడ్డాయి అంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఏపీలో కూడా ఇదే తరహా ఆరోపణలు వైసీపీకి చెందిన మాజీ ప్రజాప్రతినిధులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ వంటి నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశారు. దీనికి సంబంధించిన ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. ఈవీఎంల ట్యాంపరింగ్ కు సంబంధించి లండన్ కేంద్రంగా జగన్మోహన్ రెడ్డి గుట్టు విప్పే ప్రయత్నాలు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.

అందుకు అనుగుణంగా ఆయన లండన్ లో ఎక్కువ రోజులు సమయాన్ని వెచ్చిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే జగన్మోహన్ రెడ్డి ప్రస్తుత పరిస్థితుల్లో లండన్ పర్యటనకు వెళ్లడం పట్ల ఆ పార్టీ శ్రేణుల్లో కొంత ఆందోళన కూడా వ్యక్తం అవుతోంది. ఇప్పటికే వైసీపీకి చెందిన రాజ్యసభ ఎంపీలను టిడిపిలో చేర్చుకునేందుకు ఆ పార్టీ సిద్ధమవుతోంది. అందుకు అనుగుణంగానే మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు పార్టీకి రాజీనామా చేశారు. రాజ్యసభ స్థానాలకు రాజీనామా చేసి చైర్మన్ కు లేఖలను అందించారు. జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటనకు వెళ్లిన తర్వాత మరింత మందిని తమ పార్టీలో చేర్చుకునేందుకు బిజెపి, టిడిపి సిద్ధపడుతున్నట్లు చెబుతున్నారు. అదే జరిగితే పార్టీ మరింత ఇబ్బందులు గురయ్యే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటన వాయిదా వేసుకుని పార్టీలోని ఇబ్బందులను సద్దుమణిగించే ప్రయత్నం చేయాలన్న డిమాండ్ కొన్ని వర్గాల నుంచి వినిపిస్తోంది. అయితే మరో మూడు రోజులు పర్యటనకు సమయం ఉన్నందున.. ఈ లోగా ఇబ్బందులను క్లియర్ చేసి ఆయన పర్యటనకు వెళతారని ఆ పార్టీ వర్గాల టాక్. ఏది ఏమైనా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు అయిన తర్వాత తొలిసారి క్లిష్ట పరిస్థితులను ఆ పార్టీతో పాటు అధినేత జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొంటున్నారు. అధికారాన్ని చవిచూసిన తర్వాత ఈ తరహా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి రావడం జగన్మోహన్ రెడ్డికి కాస్త తలకుమించిన భారంగానే భావించాల్సి ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు. చూడాలి జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఎదురవుతున్న ఇబ్బందులను ఏ విధంగా ఎదుర్కొంటాడో.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్