||సస్పెండ్ అయిన వైసీపీ ఎమ్మెల్యేలు||
ఆంధ్రప్రదేశ్ లోని వెలగపూడిలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో 175 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకోవడంతో ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిశాయి. అయితే ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడిన నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలను పార్టీ నుండి తొలగిస్తూ వైసీపీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. రాయలసీమకు చెందిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, గుంటూరు జిల్లాకు చెందిన ఉండవల్లి శ్రీదేవిలను వైసీపీ పార్టీ నుండి తొలగిస్తున్నట్లు వైసీపీ పార్టీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాకు తెలిపారు. క్రాస్ ఓటింగ్ విచారణ జరిపిన అనంతరమే వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ఆ నలుగురిని తొలగించాలని ఆదేశించారని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. అయితే ఈ నలుగురిని టీడీపీ అధినేత చంద్రబాబు కొనుగోలు చేసి ఇలాంటి పనులకు పాల్పడాలని సజ్జల తెలిపారు.