వైయస్ జగన్ రూల్ బుక్ చదువుకోవాలి.. లేఖపై మంత్రి పయ్యావుల కౌంటర్

ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలంటూ స్పీకర్ అయ్యన్నపాత్రుడుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ లేఖ రాయడం పట్ల శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్ర స్థాయిలో స్పందించారు. జగన్మోహన్ రెడ్డి తప్పుడు సమాచారంతో లేఖలు రాశారని, ఆయన రూల్ బుక్ చదువుకోవాలంటూ పయ్యావుల కౌంటర్ ఇచ్చారు. ఆయన చదవకపోతే మనుషులని పెట్టి చదివించుకోవాలని స్పష్టం చేశారు.

Minister Payyavula Keshav

మంత్రి పయ్యావుల కేశవ్


ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలంటూ స్పీకర్ అయ్యన్నపాత్రుడుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ లేఖ రాయడం పట్ల శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్ర స్థాయిలో స్పందించారు. జగన్మోహన్ రెడ్డి తప్పుడు సమాచారంతో లేఖలు రాశారని, ఆయన రూల్ బుక్ చదువుకోవాలంటూ పయ్యావుల కౌంటర్ ఇచ్చారు. ఆయన చదవకపోతే మనుషులని పెట్టి చదివించుకోవాలని స్పష్టం చేశారు. లేఖ రాసిన సలహాదారుడుని కూడా మార్చుకోవాలని, అందులో అన్ని తప్పులే ఉన్నాయని ఎద్దేవా చేశారు. గతంలో 10 శాతం ఎమ్మెల్యేలు లేకపోయినా జనార్దన్ రెడ్డిని ప్రతిపక్షనేతగా గుర్తించారంటూ లేఖలో రాశారని, తెలియకపోతే తెలుసుకోవాలని స్పష్టం చేశారు. ఆయన కాంగ్రెస్ పార్టీ పక్ష నేత మాత్రమేనన్న విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదని స్పష్టం చేశారు. 

సభలో కోరానికి తగ్గ బలం ఉంటేనే ప్రతిపక్ష నేత హోదా ఇస్తారని పయ్యావుల స్పష్టం చేశారు. వైసీపీ పక్ష నేత, ప్రతిపక్షంగా జగన్ ఉంటారని, కానీ ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తింపు మాత్రం ఉండదని వివరించారు. ప్రధాన ప్రతిపక్ష నేతకు క్యాబినెట్ హోదా ఉంటుందని, ఆ హోదా కోసమే జగన్ లేఖలు రాస్తున్నారని పయ్యావుల విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు సలహాదారులను పెట్టుకున్న జగన్ కు ఈ గతి పట్టిందని జగన్ ను విమర్శించారు. మళ్ళీ అదే సలహాదారులతో స్పీకర్ కు లేఖ రాసినట్టు ఉన్నావని ఎద్దేవా చేశారు. ఏపీ అసెంబ్లీలో తానే ప్రతిపక్ష నేత అని జగన్ చెబుతున్నారన్నారు. అధికార పార్టీ కాకుండా ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే ఆ పార్టీ నేత ప్రధాన ప్రతిపక్ష నేత అవుతారని, 10 శాతం సీట్లు ఉండాలని నిబంధన ఎక్కడా లేదని స్పీకర్ కు లేఖ రాశారు. ఈ లేఖపై తాజాగా స్పందించిన మంత్రిపై జగన్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ తరహా లేఖలు రాయడం ద్వారా జగన్మోహన్ రెడ్డి రాజకీయం ఇంకా దారుణంగా తయారవుతోందని, ఎప్పటికైనా సలహాదారులను మార్చుకోవాలని మంత్రి కేశవ్ జగన్ కు సూచించారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్