రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులపై దాడులు జరుగుతుండడం పట్ల వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. కడపలో టీడీపీ శ్రేణుల దాడిలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న అజయ్‌కుమార్ రెడ్డిని వైఎస్ జగన్ పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దాడుల సాంప్రదాయాన్ని ఆపాలని, లేకపోతే భవిష్యత్లో టీడీపీ శ్రేణులకు ఇదే గతి పడుతుందన్నారు. బాధితుడికి తాము అండగా ఉంటామని, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదన్నారు.
కడప ఆసుపత్రి వద్ద మీడియాతో మాట్లాడుతున్న వైఎస్ జగన్
రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులపై దాడులు జరుగుతుండడం పట్ల వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. కడపలో టీడీపీ శ్రేణుల దాడిలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న అజయ్‌కుమార్ రెడ్డిని వైఎస్ జగన్ పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దాడుల సాంప్రదాయాన్ని ఆపాలని, లేకపోతే భవిష్యత్లో టీడీపీ శ్రేణులకు ఇదే గతి పడుతుందన్నారు. బాధితుడికి తాము అండగా ఉంటామని, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదన్నారు. బాధితుడి గాయాలు, మెడికల్ కండిషన్‌ను వైద్యులను అడిగి తెలుసుకున్న జగన్.. అజయ్ కుమార్‌రెడ్డి భరోసాను ఇచ్చారు. 25 ఏళ్ల యువకుడు అజయ్ కుమార్‌రెడ్డిని టీడీపీ శ్రేణులు దారుణంగా కొట్టాయన్నారు. వైసీపీకి ఓటేశాడన్న కారణంతో దాడికి పాల్పడ్డారన్నారు. అదే పనిగా కావాలని వచ్చి అతడికి బైక్‌ను అడ్డుకుని దాడి చేసినట్టు విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా భయాందోళనలు కలిగించే చర్యలకు దిగుతున్నారని, ఇప్పుడు టీడీపీ శ్రేణులు వేస్తున్న బీజం, చేసే పనులు భవిష్యత్‌లో టీడీపీ శ్రేణులకు చుట్టుకుంటుందని జగన్ హెచ్చరించారు. చంద్రబాబు దయచేసి ఈ చెడు సాంప్రదాయాన్ని తప్పకుండా ఆపేయాలని, ఎప్పటికీ మీరే అధికారంలో ఉండరన్న విషయాన్ని గుర్తించుకోవాలని హెచ్చరించారు. శిశుపాలుడి పాపాలు మాదిరిగా చంద్రబాబు పాపాలు పండుతున్నాయని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారన్నారు. దయచేసి ఈ తరహా దాడులను ఇక్కడితే ఆపేయాలని, లేకపోతే భవిష్యత్లో టీడీపీ శ్రేణులపై దాడులకు ఇవి ప్రేరేపిస్తాయన్నారు.
వైసీపీ శ్రేణులపై దాడులను పక్కన పెట్టి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన పథకం రాష్ట్రంలో ఎక్కడా సరిగా అమలు కావడం లేదని వైఎస్ జగన్ ఆరోపించారు. చిన్నారులుకు ఇవ్వాల్సిన బ్యాగులు, కిట్లు సరఫరా ఇప్పటికీ సరిగా జరగడం లేదన్నారు. అమ్మ ఒడి డబ్బులు ఇంకా ప్రజలు అకౌంట్‌లో వేయలేదన్నారు. నిరుద్యోగ భృతి కోసం జాబ్‌లేని యువత ఆశగా ఎదురు చూస్తున్నారని, వారికి ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు.