ప్రతిపక్ష నేత పదవిపై స్పీకర్ కు వైయస్ జగన్ లేఖ.. ఏమన్నారంటే

ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు లేఖ రాశారు. మంత్రుల తర్వాత తనతో ప్రమాణ స్వీకారం అసెంబ్లీ పద్ధతులకు విరుద్ధమని ఈ లేఖలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వకూడదన్న ఉద్దేశంతోనే ముందుగానే నిర్ణయించుకుని ఇలా చేశారంటూ జగన్మోహన్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.

YS Jaganmohan Reddy, Ayyannapatrudu

వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అయ్యన్నపాత్రుడు 

ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడుకు లేఖ రాశారు. మంత్రుల తర్వాత తనతో ప్రమాణ స్వీకారం అసెంబ్లీ పద్ధతులకు విరుద్ధమని ఈ లేఖలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వకూడదన్న ఉద్దేశంతోనే ముందుగానే నిర్ణయించుకుని ఇలా చేశారంటూ జగన్మోహన్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో నిర్వహించారని, ప్రతిపక్ష హోదా రావాలంటే 10 శాతం సీట్లు ఉండాలని చట్టంలో ఎక్కడా లేదని జగన్ మోహన్ రెడ్డి ఆ లేఖలో పేర్కొన్నారు. పార్లమెంటులో కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ ఈ నిబంధన ఎక్కడా పాటించలేదని స్పష్టం చేశారు. అధికార కూటమి, స్పీకర్ ఇప్పటికే తన పట్ల శత్రుత్వాన్ని ప్రదర్శిస్తున్నారని జగన్ ఆలేకలో వెల్లడించారు. చచ్చేదాకా కొట్టాలంటూ స్పీకర్ మాట్లాడిన మాటలు వీడియోలు ద్వారా బయటపడ్డాయని ఇలాంటి నేపథ్యంలో అసెంబ్లీలో గొంతు విప్పే పరిస్థితిలో కనిపించడం లేదని జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు ప్రతిపక్ష హోదా తోనే ప్రజా సమస్యలను బలంగా వినిపించే అవకాశం ఉంటుందని, అందుకు అవకాశాన్ని కల్పించాలని వివరించారు.

ప్రతిపక్ష పార్టీ హోదాతో సభా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చట్టబద్ధమైన భాగస్వామ్యం లభిస్తుందని, ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని లేఖను పరిశీలించాలని స్పీకర్ను జగన్మోహన్ రెడ్డి అభ్యర్థించారు.  తాజాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పీకర్ అయ్యన్నపాత్రుడు రాసిన ఈ లేఖ సంచలనంగా మారింది. కొద్దిరోజుల కిందట అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం బయటకు వెళ్లిపోయిన జగన్మోహన్ రెడ్డి ఆ తరువాత జరిగిన సభకు కూడా హాజరు కాలేదు. స్పీకర్ ఎంపికకు కూడా వైయస్ జగన్ దూరంగా ఉండిపోయారు. ఈ నేపథ్యంలో స్పీకర్ కు ఆయన లేఖ రాయడం ఆసక్తిగా మారింది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్