రాష్ట్రంలోని పరిస్థితులు, దాడులపై గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేసిన వైఎస్‌ జగన్‌

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత నెలకొన్న పరిస్థితులు, వైసీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. గవర్నర్‌ అబ్ధుల్‌ నజీర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఆదివారం సాయంత్రం గవర్నర్‌ భవన్‌కు వెళ్లిన జగన్‌ కూలంకుషంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను గవర్నర్‌కు తెలియజేశారు. ఇప్పటి వరకు జరిగిన దాడుల్లో చనిపోయిన వైసీపీ కార్యకర్తలు వివరాలు, జరిగిన ఆస్తులు నష్టం, ఇతర అంశాలకు సంబంధించిన వివరాలను గవర్నర్‌కు జగన్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా తెలియజేసినట్టు తెలిసింది.

YS Jagan with Governor Abdul Nazir

గవర్నర్‌ అబ్ధుల్‌ నజీర్‌తో వైఎస్‌ జగన్‌

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత నెలకొన్న పరిస్థితులు, వైసీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. గవర్నర్‌ అబ్ధుల్‌ నజీర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఆదివారం సాయంత్రం గవర్నర్‌ భవన్‌కు వెళ్లిన జగన్‌ కూలంకుషంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను గవర్నర్‌కు తెలియజేశారు. ఇప్పటి వరకు జరిగిన దాడుల్లో చనిపోయిన వైసీపీ కార్యకర్తలు వివరాలు, జరిగిన ఆస్తులు నష్టం, ఇతర అంశాలకు సంబంధించిన వివరాలను గవర్నర్‌కు జగన్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా తెలియజేసినట్టు తెలిసింది. పుంగనూరులో ఎంపీ మిథున్‌రెడ్డిపై జరిగిన దాడి, మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటిపై జరిగిన దాడి వంటి అంశాలను జగన్‌ గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో శాంతి, భద్రతలు క్షీణించిన విషయాన్ని ఈ సందర్భంగా జగన్‌ గవర్నర్‌కు వివరించారు. టీడీపీ అరాచకాలను అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కావాలనే సాగిస్తోందన్న విషయాన్ని వివరించారు. ప్రతిపక్షంలో ఉండగా నారా లోకేష్‌ చెప్పినట్టుగానే రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని రాష్ట్రంలో అమలు చేస్తున్నారని, కక్ష పూరిత రాజకీయాలకు పాల్పడుతున్నారంటూ జగన్‌ గవర్నర్‌కు వెల్లడించారు. రాష్ట్రంలో క్షీణించిన శాంతి, భద్రతలు, జరిగిన హత్యాకాండకు సంబంధించిన విషయాలను క్షుణ్ణంగా జగన్‌ గవర్నర్‌కు వివరించారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేయాలంటూ గవర్నర్‌ను ఈ సందర్భంగా జగన్‌ కోరినట్టు తెలిసింది. 

గవర్నర్‌తో జగన్‌ సమావేశం సుమారు 45 నిమిషాలపాటు సాగింది. జగన్‌ ఫిర్యాదు చేసిన అంశాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలతో కూడిన ఆధారాలను ఆయన సమర్పించారు. గడిచిన 45 రోజులు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా హత్యాకాండతో వైసీపీ కార్యకర్తలను భయబ్రాంతులకు గురి చేసే ప్రయత్నం టీడీపీ చేస్తోందని ఆయన ఈ సందర్భంగా గవర్నర్‌కు తెలియజేశారు. వినుకొండలో రషీద్‌ అంశాన్ని ఈ సందర్భంగా జగన్‌ ప్రత్యేకంగా ప్రస్తావించడంతోపాటు దానికి సంబంధించిన వీడియోను గవర్నర్‌కు చూపించారు. శాంతి, భద్రతల అంశంపై గవర్నర్‌ జోక్యం చేసుకోవాలని ఈ సందర్భంగా జగన్‌ కోరారు. ఇప్పటికీ హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో గవర్నర్‌ చర్యలు తీసుకోవాలని ఆయన విన్నవించారు. 


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్