వైసిపి వర్సెస్ వైయస్ షర్మిల.. ఏపీలో హీటెక్కిన అన్నా, చెల్లెళ్ళ వివాదం

ఏపీలో ఆస్తి వివాదంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన సోదరి వైయస్ షర్మిల మధ్య తలెత్తిన వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఈ వివాదం జగన్ వర్సెస్ షర్మిల మాదిరిగా ప్రారంభమై.. ప్రస్తుతం వైసీపీ వర్సెస్ వైయస్ షర్మిల అన్నట్టుగా మారింది. ఆస్తి పంపకాల విషయంలో ఇరువురి మధ్య వచ్చిన గొడవలో వైయస్ షర్మిల బహిరంగంగా జగన్ లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. వైయస్ జగన్ మాత్రం ఎక్కడ బయటకు వచ్చి ఆమె గురించి గానీ, ఆస్తి వివాదం గురించి గానీ మాట్లాడడం లేదు. కానీ వైసీపీ నాయకులు, శ్రేణులు మాత్రం వైయస్ షర్మిలను లక్ష్యంగా చేసుకొని తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేస్తున్నారు.

Sharmila, YV Subbareddy, Vijayasai Reddy

షర్మిల, వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి

ఏపీలో ఆస్తి వివాదంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన సోదరి వైయస్ షర్మిల మధ్య తలెత్తిన వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఈ వివాదం జగన్ వర్సెస్ షర్మిల మాదిరిగా ప్రారంభమై.. ప్రస్తుతం వైసీపీ వర్సెస్ వైయస్ షర్మిల అన్నట్టుగా మారింది. ఆస్తి పంపకాల విషయంలో ఇరువురి మధ్య వచ్చిన గొడవలో వైయస్ షర్మిల బహిరంగంగా జగన్ లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. వైయస్ జగన్ మాత్రం ఎక్కడ బయటకు వచ్చి ఆమె గురించి గానీ, ఆస్తి వివాదం గురించి గానీ మాట్లాడడం లేదు. కానీ వైసీపీ నాయకులు, శ్రేణులు మాత్రం వైయస్ షర్మిలను లక్ష్యంగా చేసుకొని తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేస్తున్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎన్సీఎల్టిలో కేసు వేసిన తర్వాత తీవ్రస్థాయిలో స్పందిస్తూ మీడియాతో మాట్లాడడంతో పాటు లేఖ రాసిన షర్మిల గట్టిగానే జగన్ ను విమర్శించారు. షర్మిల చేసిన విమర్శలు తర్వాత చాలామంది జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి అసలు వాస్తవాలు ఏంటో వివరిస్తారని అంతా భావించారు. కానీ అందుకు విరుద్ధంగా వైసీపీకి చెందిన ముఖ్య నాయకులు, వైయస్ కుటుంబానికి అత్యంత సన్నిహితులుగా మిగిలిన వాళ్ళు మాత్రం మీడియా ముందుకు వచ్చి వైఎస్ షర్మిల లక్ష్యంగా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. షర్మిల మీడియా సమావేశం తర్వాత మాట్లాడిన వైవి సుబ్బారెడ్డి ఆమె వ్యవహార శైలిని తీవ్ర స్థాయిలో తప్పుపట్టారు. జగన్మోహన్ రెడ్డి ఆస్తితో షర్మిలకు సంబంధం లేదంటూ వ్యాఖ్యానించారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి నుంచి వచ్చిన ఆస్తులు పంపకాలు ఎప్పుడో పూర్తయినట్లు పేర్కొన్నారు.

తాజాగా మీడియాతో మాట్లాడుతూ విజయసాయిరెడ్డి ఇదే తరహా వ్యాఖ్యలను చేశారు. చంద్రబాబుతో కలిసి దుష్ట రాజకీయాలను షర్మిల పన్నుతున్నారని, మరోసారి జగన్మోహన్ రెడ్డిని సీఎం కానీయకూడదు అన్న లక్ష్యంతోనే ఈ తరహా డైవర్షన్ పాలిటిక్స్ కు చంద్రబాబునాయుడు పాల్పడుతున్నారంటూ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. ఎవరి వల్ల అయితే రాజశేఖర్ రెడ్డి మృతి చెందారు వారితోనే కలిసి షర్మిల చేస్తున్న రాజకీయాలను చూసి వైఎస్ ఆత్మ క్షోభిస్తుందంటూ ఆయన తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. తిరుపతి మాజీ ఎమ్మెల్యే, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కూడా ఇదే తరహా వ్యాఖ్యలను చేశారు. నష్టాల్లో ఉన్నప్పుడు భాగస్వామ్యం తీసుకొని షర్మిల ఇప్పుడు మాత్రం ఆస్తిలో వాటాలు అడుగుతుండడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి డైనమిక్ లీడర్ వెంట ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా ప్రజలు ఉంటారని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి కూడా షర్మిలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్ వారసరాలుగా వ్యక్తిగత ఇమేజ్ సృష్టించుకునేందుకు తెలంగాణలో, ఏపీలో చేసిన షర్మిల ప్రయత్నాలు విఫలమయ్యాయి అన్నారు. తెలంగాణలో ఆమో కమెడియన్ గా మిగిలిపోయారని, ఏపీలో మాత్రం విలన్ పాత్ర పోషిస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక సామాజిక మాధ్యమాలు వేదికగా కూడా వైసీపీకి చెందిన అభిమానులు కార్యకర్తలు, వైయస్ షర్మిలను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. ఎవరి ప్రోద్బలంతో జగన్మోహన్ రెడ్డి పై ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారు ప్రజలకు అర్థమవుతుందంటూ పేర్కొంటున్నారు. దీంతో ప్రస్తుతం ఏపీలో వైయస్ షర్మిల వర్సెస్ వైసీపీ అన్నట్టుగా రాజకీయ వాతావరణం మారిపోయింది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్