బడ్జెట్‌లో రాస్త్రానికి కేటాయింపులపై వైసీపీ విమర్శ.. ప్రచార ఆర్భాటాలెందుకని ప్రశ్న

బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన కేటాయింపులపై వైసీపీ విమర్శలు చేసింది. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ ఏపీకి ప్రయోజనం ఏమీ చేకూరలేదని ఆక్షేపించింది. రాష్ట్రానికి ఏమీ తీసుకురాలేకపోయినప్పటికీ టీడీపీ మాత్రం డబ్బా కొట్టుకుంటోందని విమర్శించింది. గతంలో మాదిరిగా టీడీపీ ప్రచారం చేసుకుంటోంది తప్పా.. రాష్ట్రానికి పెద్దగా ఒనగూరే ప్రయోజనాలేవీ లేవంది.

ycp

వైసీపీ 

బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన కేటాయింపులపై వైసీపీ విమర్శలు చేసింది. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ ఏపీకి ప్రయోజనం ఏమీ చేకూరలేదని ఆక్షేపించింది. రాష్ట్రానికి ఏమీ తీసుకురాలేకపోయినప్పటికీ టీడీపీ మాత్రం డబ్బా కొట్టుకుంటోందని విమర్శించింది. గతంలో మాదిరిగా టీడీపీ ప్రచారం చేసుకుంటోంది తప్పా.. రాష్ట్రానికి పెద్దగా ఒనగూరే ప్రయోజనాలేవీ లేవంది. ఈ మేరకు వైసీపీ ట్వీట్‌ చేసింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు బదులుగా ప్రత్యేక సహాయాన్ని ఇవ్వాలంటూ చంద్రబాబు గతంలోనే మోసం చేశారని, అర్ధరాత్రి అద్భుత ప్రకటన అంటూ హడావిడి చేసిన విషయాన్ని ఈ సందర్భంగా వైసీపీ గుర్తు చేసింది. ఏపీకి ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రం స్వరం అవుతుందా..? అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారని, స్పెషల్‌ స్టేటస్‌ అంశంపై నీళ్లు చల్లిన ఘనుడు చంద్రబాబు అని పేర్కొంది. రాష్ట్రం కోసం సాధించుకోవాల్సిన హక్కుపై సీఎం హోదాలో చంద్రబాబు నీళ్లు చల్లేశారని వెల్లడించింది. స్పెషల్‌ ప్యాకేజీతో ఏపీ రూపురేఖలు సమూలంగా మారిపోతాయన్న భావనను కలిగించిన మోసం చేశారని విమర్శించింది. 

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ తాజా బడ్జెట్‌లో కేటాయించిన రూ.15 వేలు కోట్లు నిధులు వివిధ ఏజెన్సీలు ద్వారా వచ్చే కొన్నేళ్లలో ఇస్తామన్నారని పేర్కొంది. రూ.15 వేలు కోట్లు అప్పులుగా ఇస్తున్నారా..? గ్రాంటుగా ఇస్తున్నారా..? అని ప్రశ్నించిన వైసీపీ... అది అప్పు అయితే దాని వల్ల రాష్ట్రానికి ప్రయోజనం ఏమీ ఉండదన్నారు. చంద్రబాబు చెప్పేది ఒకటని, కానీ, జరుగుతున్నది మరొకటని వెల్లడించింది. రాజధాని అమరావతి ఎప్పటికి పూర్తవుతుందని ప్రశ్నించిన వైసీపీ.. మరోసారి రాష్ట్ర ప్రజలను మోసం చేయడం కాదా..? అని ప్రశ్నిస్తూ వైసీపీ ఎక్స్‌(ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది. 


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్