వైసీపీ అధినేత జగన్ సంచలన ట్వీట్.. ఎన్నికల్లో ఈవీఎంల బదులు పేపర్ బ్యాలెట్లు వాడాలంటూ పోస్ట్

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన ట్వీట్ చేశారు. దేశంలో నిర్వహించే ఎన్నికల్లో ఈవీఎంలకు బదులు పోస్టల్ బ్యాలెట్లు వినియోగించాలంటూ జగన్ ట్వీట్ లో పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన అనేక ప్రజాస్వామ్య దేశాల్లో ఏవీఎంలకు బదులు పేపర్ బ్యాలెట్లు మాత్రమే వాడుతున్నారని, భారత్లోనూ బ్యాలెట్లు వాడాలని కోరారు జగన్.

ys jagan

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన ట్వీట్ చేశారు. దేశంలో నిర్వహించే ఎన్నికల్లో ఈవీఎంలకు బదులు పోస్టల్ బ్యాలెట్లు వినియోగించాలంటూ జగన్ ట్వీట్ లో పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన అనేక ప్రజాస్వామ్య దేశాల్లో ఏవీఎంలకు బదులు పేపర్ బ్యాలెట్లు మాత్రమే వాడుతున్నారని, భారత్లోనూ బ్యాలెట్లు వాడాలని కోరారు జగన్. న్యాయం జరగడమే కాకుండా.. న్యాయం జరిగినట్లు కనిపించాలని ఈ సందర్భంగా జగన్ సూచించారు. ప్రస్తుతం ఈ ట్వీట్ దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తోంది. ఇప్పటికే టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఈవీఎంలు ట్యాంపరింగ్ విషయంపై మాట్లాడగా, దేశంలో రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్ కూడా ఈ తరహా వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో జగన్ చేసిన ట్వీట్ సంచలనం సృష్టిస్తోంది.

ఎన్నికల ఫలితాలు అనంతరం మీడియాతో మాట్లాడిన జగన్.. ఏదో జరిగిందని, అది దేవుడుకు మాత్రమే తెలియాలని పేర్కొన్నారు. ఆ తరువాత ఆయన మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు. తాజాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ తరహా వ్యాఖ్యలతో కూడిన పోస్టు చేయడంతో ఆసక్తి కలిగిస్తోంది. దేశ వ్యాప్తంగా ఇప్పటికే ఈవీఎంలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేసిన ట్వీట్ పై అధికార తెలుగుదేశం పార్టీ నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. 2019 ఎన్నికల్లో జగన్ గెలిచినప్పుడు ఈవీఎంల గురించి ఎందుకు మాట్లాడలేదు అంటూ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. జగన్ ఇంకా షాక్ నుంచి ఇంకా బయటకు రాలేదని, ఆంధ్ర ఎలాన్ మస్క్ మాదిరిగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్