శ్వేత పత్రాల విడుదలపై చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్ ఫైర్.. డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతున్నారంటూ విమర్శ

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న శ్వేత పత్రాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడిన ఆయన అనేక అంశాలపై సుదీర్ఘంగా మాట్లాడారు. చంద్రబాబు విడుదల చేస్తోంది వైట్ పేపర్లు కాదని, తప్పుడు పేపర్లని జగన్ ఆరోపించారు. చంద్రబాబు విడుదల చేసిన వైట్ పేపర్లకు సంబంధించిన ఆధారాలను తాము అందిస్తామన్నారు. తమపై నిందలు మోపడం, విమర్శించడమే పనిగా పెట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని, కాబట్టి వాస్తవాలను విశ్లేషించాలని మీడియా ప్రతినిధులను జగన్ కోరారు. చంద్రబాబు డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

Former Chief Minister Jaganmohan Reddy

మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న శ్వేత పత్రాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడిన ఆయన అనేక అంశాలపై సుదీర్ఘంగా మాట్లాడారు. చంద్రబాబు విడుదల చేస్తోంది వైట్ పేపర్లు కాదని, తప్పుడు పేపర్లని జగన్ ఆరోపించారు. చంద్రబాబు విడుదల చేసిన వైట్ పేపర్లకు సంబంధించిన ఆధారాలను తాము అందిస్తామన్నారు. తమపై నిందలు మోపడం, విమర్శించడమే పనిగా పెట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని, కాబట్టి వాస్తవాలను విశ్లేషించాలని మీడియా ప్రతినిధులను జగన్ కోరారు. చంద్రబాబు డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రషీద్ దారుణ హత్యను ఖండిస్తూ తాను వినుకొండ వెళ్తుంటే దాన్నుంచి ప్రజల దృష్టిని మళ్లించడం కోసం మదనపల్లి ఆర్డీవో కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగిందని, అదో కుట్ర అంటూ దుష్ప్రచారం చేశారన్నారు. ఈ ఘటనపై రెండుసార్లు రివ్యూ చేసిన చంద్రబాబు డిజిపిని హుటాహుటిన మదనపల్లికి హెలికాప్టర్లో పంపారని, మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై నిందలు మోపుతూ నానాగా హంగామా చేశారన్నారు. దీనిపై ఎల్లో మీడియాలో విపరీతంగా ప్రచారం కల్పించారన్నారు. పెద్దిరెడ్డి కుటుంబాన్ని అప్రతిష్ట పాలు చేయడం కోసం నిందలు మోపుతున్నారని ఆరోపించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారని, ఆయన కుమారుడు మిథున్ రెడ్డి మూడుసార్లు ఎంపీగా గెలిచారన్నారు. అటువంటి వారిపై దాడి చేయడంతోపాటు ఆస్తులు విధ్వంసం చేయడం దుర్మార్గమన్నారు. మదనపల్లిలో అగ్నిప్రమాదం జరిగితే డీజీపీని హెలికాప్టర్లో పంపిన చంద్రబాబు, నంద్యాల జిల్లా మచ్చుమర్రిలో మైనర్ బాలిక అదృశ్యమై చివరకు ఆమె బాడీ దొరకపోయినా ప్రభుత్వం స్పందించలేదన్నారు. కేసు దర్యాప్తులో ఉండగానే ఎస్పీ బదిలీ ఎందుకు జరిగిందో చెప్పాలన్నారు. ఒక అనుమానితుడి లాకప్ డెత్ ఎలా జరిగిందని జగన్ ప్రశ్నించారు. 

రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, 45 రోజుల్లోనే 12 మందిపై అత్యాచారం జరిగిందన్నారు. తమ ప్రభుత్వ హయాంలో దిశా పోలీస్ స్టేషన్లు, దిశ యాప్ మహిళలకు ఒక వరంలా ఉండేదన్నారు. ఆపదలో ఉన్న మహిళలు యాప్ వినియోగించినా, ఫోన్ ఐదుసార్లు ఊపిన వెంటనే పోలీసులకు అక్కడ చేరుకుని రక్షించే వారన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో అటువంటి పరిస్థితి లేకుండా పోయిందని స్పష్టం చేశారు. తమ పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఎన్నికల్లో అక్రమంగా కేసు బనాయించారని, ఎస్పీని మార్చారన్నారు. వినుకొండలో రషీద్ ను అత్యంత దారుణంగా హతమార్చారన్నారు. సీఎం కొడుకు, మంత్రి నారా లోకేష్ ఏకంగా రెడ్ బుక్ ప్రదర్శిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని, రాష్ట్రమంతా హోర్డింగ్లు ఏర్పాటు చేశారన్నారు. ఆంధ్రప్రదేశ్ అంటే అరాచకం, ఆటవికం రెడ్ బుక్ పాలన అన్నట్టుగా నిర్వచనం మారిపోయిందని ఆరోపించారు. రాష్ట్రంలో ఎవరూ రోడ్లపైకి రావద్దు, హామీల అమలు చేయకపోయినా చంద్రబాబును ప్రశ్నించకూడదు అన్నట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తల్లికి వందనం కోసం 43 లక్షల మంది తల్లులు, 82 లక్షలు మంది పిల్లలు ఎదురుచూస్తున్నారని, రైతులు పెట్టుబడి సాయం కోసం రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారన్నారు. జగన్ ఉండి ఉంటే ఏపాటికి ఆయా పథకాలకు సంబంధించిన ఆర్థిక సాయం అంది ఉండేదన్న భావన ప్రజల్లో ఉందన్నారు.

ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకుండా చంద్రబాబు తాత్సారం చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల ఫలితాలు వచ్చి 52 రోజులు దాటుతోందని, రాష్ట్రం పూర్తిగా రివర్స్ లోకి వెళుతోందన్నారు. రాష్ట్రంలోని ప్రజల ప్రశ్నించే హక్కును కోల్పోయారని, ఎక్కడికక్కడ అణిచివేత ధోరణి కొనసాగుతోందన్నారు. రెగ్యులర్ బడ్జెట్ పెట్టే ధైర్యం కూడా చంద్రబాబుకు లేదని ఆరోపించారు. పథకాలకు నిధులు కేటాయింపు చేయాల్సి వస్తే అబద్దాలు చెప్పాల్సి వస్తుందని, కాబట్టే రెగ్యులర్ బడ్జెట్ పెట్టకుండా దాటవేస్తున్నాడని ఆరోపించారు. ఎన్నికలకు ముందు ఏఏ పథకాలపై హామీ ఇచ్చారో, వాటికి నిధులు కేటాయించి అమలు చేస్తాడా..? అని ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. రాష్ట్రంలో ప్రజలు బయటికి రాకుండా, ప్రశ్నించకుండా హత్య రాజకీయాలు చేస్తున్నారని, ప్రజలను భయపెడుతున్నారని విమర్శించారు. ఒక వ్యక్తిని అప్రతిష్ట పాలు చేయడం కోసం ప్రచారం చేయడమే చంద్రబాబు అలవాటుగా మార్చుకున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు టార్గెట్ చేసిన వ్యక్తిపై విమర్శలు చేయడం, దానిపై అందరూ మాట్లాడేలా చేయడం ఆయన అలవాటుగా మార్చుకున్నట్లు స్పష్టం చేశారు. సదరు వ్యక్తిపై అనుకూల మీడియాలో అదే పనిగా విమర్శలు చేయడం, డిబేట్ లు పెట్టడం ద్వారా వారి ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  గతంలో ఎన్టీఆర్ ను గద్దె దించడం మొదలు, ఆ తర్వాత బిజెపిని తిట్టడం, మళ్ళీ దగ్గరకు వెళ్లడం, మధ్యలో మరో పార్టీకి చేరుకోవడం వరకు చంద్రబాబు చేసే విధానాలన్నీ అలానే ఉంటాయన్నారు. తాను ఏది చేసిన అది మంచిదే అన్నట్లు చెప్పుకుంటాడని, దానితో అందరిని అవును అనిపించుకోవడం కోసం ప్రయత్నిస్తుంటాడని విమర్శించారు. రాష్ట్రంలో 14 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని తమ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేశారని, మరోవైపు సూపర్ సిక్స్ అంటూ హామీలు గుప్పించారన్నారు. కేంద్ర ఆర్థిక సర్వేలో ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ప్రశంసించిన విషయాన్ని ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గుర్తు చేశారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్