బిజెపి అభ్యర్థి అందెల శ్రీరాములు గెలుపు కోసం ఆడపడుచుల ఇంటింటి ప్రచారం

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

||బిజెపి అభ్యర్థి అందెల శ్రీరాములు గెలుపు కోసం ఆడపడుచుల ఇంటింటి ప్రచారం||

(రంగారెడ్డి, ఈవార్తలు ప్రతినిధి, అక్కినేపల్లి పురుషోత్తం రావు)

మహేశ్వరం నియోజకవర్గం బడంగ్ పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నాదర్గుల్ 9వ డివిజన్ కార్పొరేటర్ నిమ్మల సునీత శ్రీకాంత్ గౌడ్ గడపగడపకు ప్రచారం నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ మహేశ్వరం నియోజకవర్గం బిజెపి అభ్యర్థి అందెల శ్రీరాములు యాదవ్ కు బడంగ్ పేట మున్సిపల్ కార్పొరేషన్ ఆడపడుచులు అండగా నిలిచారు. శనివారం నాడు పలు డివిజన్ల నుంచి స్వచ్ఛందంగా తరలివచ్చి నాదర్గుల్ తొమ్మిదవ డివిజన్ కార్పొరేటర్ నిమ్మల సునీత శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఏ ఇంటికి వెళ్లినా మహిళలు బిజెపికి ఓటు వేసి అందెల శ్రీరాములు యాదవ్‌కు అత్యధిక మెజార్టీ కట్టబెడతామని చెప్పారు. ప్రతి కార్యకర్త, నాయకుడు తామే అభ్యర్థి అన్నట్లు కష్టపడుతున్నామని మహిళా మోర్చా నాయకురాలు నివేదిత తెలిపారు. ఈ ప్రచార కార్యక్రమంలో అందెల శ్రీరాములు కుటుంబ సభ్యులు సహ గడ్డం మమతారెడ్డి సుష్మారెడ్డితో పాటు ఆడపడుచులు పాల్గొన్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్