పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఫైర్‌.. నీతి అయోగ్‌ మీటింగ్‌ నుంచి వాకౌట్‌

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నీతి అయోగ్‌ సమావేశంలో ఫైర్‌ అయ్యారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మాట్లాడేందుకు 20 నిమిషాలకు పైగా సమయాన్ని కేటాయించగా, తన మైక్‌ను మాత్రం మధ్యలోనే కట్‌ చేయడం పట్ల ఆమె తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఢిల్లీలో నీతి అయోగ్‌ సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న మమతా బెనర్జీ.. నీతి అయోగ్‌ అధికారులు వ్యవహరించిన తీరు పట్ల అసహనం వ్యక్తం చేస్తూ వాకౌట్‌ చేశారు. ఇతర రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు 15 నిమిషాలకుపైగా మాట్లాడారని, తనను మాట్లాడనీయకుండా కేంద్రం కక్షపూరితంగా వ్యవహరించిందంటూ మమతా బెనర్జీ బయటకు వచ్చిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆరోపించారు.

CM Mamata Benerjee

ముఖ్యమంత్రి మమతా బెనర్జీ 

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నీతి అయోగ్‌ సమావేశంలో ఫైర్‌ అయ్యారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మాట్లాడేందుకు 20 నిమిషాలకు పైగా సమయాన్ని కేటాయించగా, తన మైక్‌ను మాత్రం మధ్యలోనే కట్‌ చేయడం పట్ల ఆమె తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఢిల్లీలో నీతి అయోగ్‌ సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న మమతా బెనర్జీ.. నీతి అయోగ్‌ అధికారులు వ్యవహరించిన తీరు పట్ల అసహనం వ్యక్తం చేస్తూ వాకౌట్‌ చేశారు. ఇతర రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు 15 నిమిషాలకుపైగా మాట్లాడారని, తనను మాట్లాడనీయకుండా కేంద్రం కక్షపూరితంగా వ్యవహరించిందంటూ మమతా బెనర్జీ బయటకు వచ్చిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆరోపించారు. నీతి అయోగ్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. గతంలో ఉన్న ప్లానింగ్‌ కమిషన్‌ను మళ్లీ తీసుకురావాలన్నారు. ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి అయోగ్‌ సమావేశం రాష్ట్రపతి భవన్‌లో జరగ్గా, ఈ సమావేశానికి కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన ముఖ్యమంత్రులు హాజరు కాలేదు. ఇండియా కూటమి నుంచి మమతా బెనర్జీ మాత్రమే హాజరయ్యారు. మొత్తంగా చూస్తే ఏడు రాష్ట్రాల నుంచి నీతి అయోగ్‌ సమావేశానికి ముఖ్యమంత్రులు హాజరుకాలేదు. 

బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఆరోపణ

నీతి అయోగ్‌ సమావేశం నుంచి బయటకు వచ్చిన తరువాత పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రస్థాయిలో ఆరోపించారు. మోదీ సర్కార్‌ పశ్చిమ బెంగాల్‌కు అన్యాయం చేసిందని విమర్శించారు. బడ్జెట్‌లో బెంగాల్‌ను అవమానించారని పేర్కొన్నారు. విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు నిధులు ఇవ్వలేదని ఆరోపించిన ఆమె.. నీతి అయోగ్‌ సమావేశానికి ఇండియా కూటమి ముఖ్యమంత్రులు రాకపోవడానికి కారణం అదేనన్నారు. తమ రాష్ట్రాలకు సరైన కేటాయింపులు ఎందుకు చేయలేదని మమత ప్రశ్నించారు. 


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్