||కాంగ్రెస్ పార్టీ కార్యాలయం||
(రంగారెడ్డి, ఈవార్తలు ప్రతినిధి, అక్కినేపల్లి పురుషోత్తమరావు)
నవంబర్ 30వ తేదీన జరిగే ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కాంగ్రెస్ పార్టీకే ఓట్లు వేస్తామని కరాఖండీగా చెబుతున్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని హామీ ఇవ్వడం, సీపీఎస్ విధానం రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ ఓపిఎస్ విధానం అమలు చేస్తామని చెప్పడం, జీవో 317 ను సమీక్షించి బాధిత ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పడం ఏటా ఉద్యోగులు ఉపాధ్యాయుల బదిలీలు చేస్తామని చెప్పడం, కొత్త పీఆర్సీని ప్రకటించి ఆరు నెలలలోపు అమలు చేస్తామని చెప్పడంతో ప్రభుత్వ ఉద్యోగులంతా ఆనందంతో తమ ఓట్లన్నీ కాంగ్రెస్ పార్టీకే గంపగుత్తగా వేస్తామని చెబుతున్నారు. ఇదిలా ఉండగా అన్ని ఆసుపత్రుల్లో వైద్యం అందేలా హెల్త్ కార్డ్స్ అందజేస్తామని, ఫీల్డ్ అసిస్టెంట్లకు, ఆశా వర్కర్లకు వేతనం పెంచి ఉద్యోగ భద్రత కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ భరోసా ఇవ్వడంతో ఉద్యోగులంతా ఆ పార్టీ వైపు మొగ్గుచూపు అవకాశాలు కనిపిస్తున్నాయి. అందులోనూ తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ గాలివీస్తున్న నేపథ్యంలో ఈసారి ఆ పార్టీదే విజయం అని అని ప్రభుత్వం ఉద్యోగులు, నిరుద్యోగులు చెబుతున్నారు.
