కార్తీక సోమవారాన్ని పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల్లో శైవాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం కూడా భక్తులతో నిండిపోయింది. భక్తులు స్వామి వారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటున్నారు.
వేములవాడ, ఈవార్తలు : కార్తీక సోమవారాన్ని పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల్లో శైవాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం కూడా భక్తులతో నిండిపోయింది. భక్తులు స్వామి వారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటున్నారు. కాగా, రాష్ట్ర రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం రాజన్నను దర్శించుకున్నారు. మాజీ మంత్రి కనుమూరి బాపిరాజు, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌తో కలిసి రాజన్న దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం.. స్వామివారికి గోపూజ నిర్వహించి, కోడె మొక్కులు తీర్చుకున్నారు. దర్శనానంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. ‘రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కి ప్రతి తెలంగాణ పౌరుడు సహకరించమని ప్రభుత్వం పక్షాన విజ్ఞప్తి చేస్తున్నా. ఇది ఎవరి సమాచారాన్ని ఇబ్బంది పెట్టేందుకు కాదు.. బలహీన వర్గాలకు మాత్రమే పరిమితమైంది కాదు.తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక దిక్సూచి అవసరాల కోసం తీసుకుంటున్న సమాచారం. కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఏం చేసిందని అంటున్నారు. అసలు బీసీ ల గురించి మాట్లాడే అర్హత కేటీఆర్‌కు ఉందా? కేటీఆర్ బీసీల గురించి మాట్లాడే అర్హత ఉండాలంటే బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవి, కార్యనిర్వహక పదవి, ప్రతిపక్ష పదవి బీసీలకు, ఎస్సీలకు ఒక్కోటి ఇస్తే ఆ అర్హత వస్తుంది’ అని మండిపడ్డారు.
‘కుల సర్వే ఇష్టం లేని బీజేపీ, తెలంగాణలో బీసీలకు అన్యాయం చేయాలని చూస్తున్న బీఆర్ఎస్ కలిసి సర్వేను అప్రతిష్టపాలు చేయాలని చూస్తున్నాయని ఆరోపించారు. జీవో నంబర్ 18 ద్వారా యావత్ తెలంగాణలో సమాచారం సేకరించి అసమానతలు తొలగించి అన్ని రకాలుగా న్యాయం చేయాలనే ఆలోచనతో ముందుకు పోతున్నామని వివరించారు. రాజకీయ పార్టీల రెచ్చగొట్టే వ్యాఖ్యలకు ప్రభావితం కావద్దని కోరుతున్నానని అన్నారు. తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన వచ్చిందని, భవిష్యత్తు ప్రణాళికలతో ముందుకు పోతున్నామని పేర్కొన్నారు.