మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చుట్టూ బిగిస్తున్న వచ్చు.. ఆసక్తిరేపుతున్న వ్యవహారం.!

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశి చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో ఆయనను అరెస్టు చేసినట్లు చెబుతున్నారు. కానీ ఈ అరెస్టును ఇప్పటివరకు పోలీసులు ధ్రువీకరించలేదు. అదే సమయంలో లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆయనను అన్ని వైపుల నుంచి బిగించే ప్రయత్నం జరుగుతున్నట్లు వైసిపి నాయకుల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన చేసిన తప్పులను ఒకవైపు ఎస్టాబ్లిష్ చేస్తూనే.. మరోవైపు కేసులు ద్వారా ఉక్కిరిబిక్కిరి చేసే ప్రయత్నం జరుగుతున్నట్లు చెబుతున్నారు.

Former MLA Vallabhaneni Vamsi

మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో ఆయనను అరెస్టు చేసినట్లు చెబుతున్నారు. కానీ ఈ అరెస్టును ఇప్పటివరకు పోలీసులు ధ్రువీకరించలేదు. అదే సమయంలో లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆయనను అన్ని వైపుల నుంచి బిగించే ప్రయత్నం జరుగుతున్నట్లు వైసిపి నాయకుల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన చేసిన తప్పులను ఒకవైపు ఎస్టాబ్లిష్ చేస్తూనే.. మరోవైపు కేసులు ద్వారా ఉక్కిరిబిక్కిరి చేసే ప్రయత్నం జరుగుతున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే ఆయనకు కీలక అనుచరులుగా ఉన్న పలువురుపై కేసులు నమోదు చేసి అరెస్టు ఇప్పటికే ఆయనకు కీలక అనుచరులుగా ఉన్న పలువురుపై కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. వంశీని కూడా మరింత ఉక్కిరిబిక్కిరి చేసేలా కేసులు పెట్టాలని ప్రభుత్వ పెద్దలనుంచి పోలీసులకు ఆదేశాలు అందినట్లు చెబుతున్నారు. దీనికి ప్రధాన కారణం వైసీపీలో ఉండగా ఆయన చేసిన తీవ్రస్థాయి వ్యాఖ్యలుగా చెబుతున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి పై వంశీ చేసిన వ్యాఖ్యలను సీరియస్ గానే తెలుగుదేశం పార్టీ తీసుకుంది. అప్పుడే తెలుగుదేశం పార్టీ హిట్ లిస్టులో వంశీ చేరిపోయారు. కూటమి ప్రభుత్వం రాగానే వంశీని లక్ష్యంగా చేసుకొని కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అదే సమయంలో మట్టి తవ్వకాల్లో అక్రమాలు, నకిలీ ధ్రువీకరణ పత్రాలతో ఇతరుల ఆస్తులను రిజిస్ట్రేషన్ చేయించుకోవడం, భూ లావాదేవీలు వంటి వ్యవహారాల్లో వంశీ అనుచరులు చేసిన అడ్డగోలు వ్యవహారాలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ మేరకు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో పలువురు ఫిర్యాదులు చేశారు. ఈ ఫిర్యాదులపై ఎమ్మెల్యే సీరియస్ గానే ముందుకు వెళుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి వంశీ పై మరింత దూకుడుగా వ్యవహరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో వంశీని మరిన్ని కేసుల్లో బుక్ చేసే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 

వైసీపీ నుంచి పోటీ చేసి ఓటమి 

గన్నవరం నియోజకవర్గం నుంచి వల్లభనేని వంశీ రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014, 2019 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన వంశీ విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో టిడిపికి దూరం అయిన ఆయన వైసీపీకి దగ్గరయ్యారు. వైసీపీకి దగ్గర అయిన తర్వాత టిడిపి పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన వంశీ.. ఒకానొక దశలో వ్యక్తిగత విమర్శలకు దిగిపోయారు. ఆ తరువాత వంశీ చేసిన విమర్శలు రాష్ట్రస్థాయిలో వివాదాస్పదం అయ్యాయి. దీంతో అప్పటినుంచి తెలుగుదేశం పార్టీ శ్రేణులు వంశీని లక్ష్యంగా చేసుకొని సామాజిక మాధ్యమాల్లో తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అయితే అప్పుడే వంశీ తెలుగుదేశం పార్టీ హిట్ లిస్టులోకి చేరిపోయారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నేతలపై సీరియస్ గానే చర్యలు తీసుకుంటామని అప్పట్లో నారా లోకేష్ కూడా ప్రకటించారు. అనుకున్నట్టుగానే కూటమి అధికారంలోకి రావడంతో ఈ నేతలపై నారా లోకేష్ దృష్టి సారించారు. అందులో భాగంగానే తెలుగుదేశం పార్టీ కార్యాలయం పై దాడి కేసులో వంశీ పై కేసు నమోదు చేసిన పోలీసులు.. మరికొన్ని విషయాల్లోనూ వంశీని చేర్చేందుకు సిద్ధపడుతున్నారు. అన్ని వైపుల నుంచి వంశీని రౌండప్ చేయడం ద్వారా కోలుకో లేకుండా చేయాలని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ వ్యవహారం నుంచి ఆయన ఎలా బయటపడతారో చూడాల్సి ఉంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్