ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు వదినమ్మ సురేఖ ప్రత్యేక బహుమతి

ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అద్భుత విజయాన్ని సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగా, డిప్యూటీ సీఎంగా పవన్‌ కల్యాణ్‌ నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో పవన్‌ కల్యాణ్‌ అన్న చిరంజీవి భార్య సురేఖ పవన్‌ కల్యాణ్‌కు స్పెషల్‌ గిఫ్ట్‌ అందించారు. దీనికి సంబంధించిన వీడియోను చిరంజీవి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు.

Pawan Kalyan with Vadinamma Surekha

వదినమ్మ సురేఖతో పవన్ కళ్యాణ్




ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అద్భుత విజయాన్ని సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగా, డిప్యూటీ సీఎంగా పవన్‌ కల్యాణ్‌ నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో పవన్‌ కల్యాణ్‌ అన్న చిరంజీవి భార్య సురేఖ పవన్‌ కల్యాణ్‌కు స్పెషల్‌ గిఫ్ట్‌ అందించారు. దీనికి సంబంధించిన వీడియోను చిరంజీవి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తరువాత అన్న చిరంజీవి ఇంటికి పవన్‌ కల్యాణ్‌ తన భార్య అన్న లెజినోవాతో కలిసి వెళ్లారు. ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్‌కు చిరంజీవి భార్య సురేఖ ఖరీదైన పెన్నును బహుమతిగా ఇచ్చారు. పెన్‌ తీసి మరిది జేబులో పెడుతూ ఆశీర్వదించారు. వదినమ్మ ఇచ్చిన బహుమతిని చూసి మురిసిపోయిన పవన్‌ కల్యాణ్‌ ఆమెను హత్తుకుని నుదుటిపై ముద్దు పెట్టారు. ఆ తరువాత చిరంజీవి వచ్చి పవన్‌ జేబుపై చేయి పెట్టి ఏదో చెప్పారు. ఇలా ఎమోషనల్‌గా ఈ వీడియో సాగింది. ఈ వీడియోను చిరంజీవి ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు. తెలుగు ప్రజల ఆకాంక్షలను నిజం చేస్తావని ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ.. వదిన, అన్నయ్య’ అని పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నట్టుగా వీడియో రాసిన అక్షరాలతో ముగిసింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. మరోసారి అన్నదమ్ముల అప్యాయతకు, మెగా ఫ్యాన్స్‌కు ఎమోషనల్‌ అవుతున్నారు. కాగా, ఎన్నికల ప్రచారం నుంచి మెగా కుటుంబమంతా పవన్‌ కల్యాన్‌ వెంట నడిచింది. ప్రతి ఒక్కరూ ఆయనకు మద్ధతు తెలిపారు. రామ్‌ చరణ్‌, వరుణ్‌ తేజ్‌, ఇతర మెగా హీరోలు పవన్‌ కల్యాణ్‌ కోసం పిఠాపురం వెళ్లి మరీ ప్రచారం చేశారు. తాజాగా పవన్‌ కల్యాణ్‌ విజయం సాధించి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో వీరంతా ఆనందంలో మునిగిపోతున్నారు. 



సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్