వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్రకు సంబంధించి పార్టీలో కీలక మార్పులు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఉత్తరాంధ్ర పార్టీ ఇన్చార్జిగా జగన్మోహన్ రెడ్డి బాబాయ్, రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి వ్యవహరిస్తున్నారు. ఉత్తరాంధ్రకు సంబంధించి ఈయన బాధ్యతగా ఉన్నప్పుడే ఈ ప్రాంతంలో పార్టీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. అధికారం కోల్పోయిన తర్వాత కొద్దిరోజుల కింద జరిగిన జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లోను వైసిపి దారుణమైన పరాభవాన్ని మూటగట్టుకుంది. జీవీఎంసీలో మెజారిటీ ఉన్నప్పటికీ వైసీపీకి సంబంధించిన అభ్యర్థులు దారుణంగా ఓడిపోయారు.
ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్రకు సంబంధించి పార్టీలో కీలక మార్పులు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఉత్తరాంధ్ర పార్టీ ఇన్చార్జిగా జగన్మోహన్ రెడ్డి బాబాయ్, రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి వ్యవహరిస్తున్నారు. ఉత్తరాంధ్రకు సంబంధించి ఈయన బాధ్యతగా ఉన్నప్పుడే ఈ ప్రాంతంలో పార్టీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. అధికారం కోల్పోయిన తర్వాత కొద్దిరోజుల కింద జరిగిన జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లోను వైసిపి దారుణమైన పరాభవాన్ని మూటగట్టుకుంది. జీవీఎంసీలో మెజారిటీ ఉన్నప్పటికీ వైసీపీకి సంబంధించిన అభ్యర్థులు దారుణంగా ఓడిపోయారు. ఈ వ్యవహారాలన్నీ ఉత్తరాంధ్రకు సంబంధించి మార్పులు చేర్పులు చేసే దిశగా చేస్తున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న వైవి సుబ్బారెడ్డిని తొలగించి తాజాగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్సీగా విజయం సాధించిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు ఈ బాధ్యతలను అప్పగిస్తారని చెబుతున్నారు. అపార అనుభవంతోపాటు మూడు జిల్లాల్లో ఆయనకు పెద్ద ఎత్తున అనుచరగణం కూడా ఉంది. పార్టీలో ఏర్పడే క్లిష్ట పరిస్థితులను చక్కదిద్దడం బొత్సకు వెన్నతో పెట్టిన విద్య. తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇది నిరూపితం అయింది కూడా. ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ కాకుండా మరొకరిని అభ్యర్థిగా వైసిపి బరిలోకి దించి ఉంటే ఈ స్థానాన్ని కోల్పోయేది అని వైసీపీకి చెందిన ముఖ్య నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. బొత్స సత్యనారాయణ పార్టీ అభ్యర్థిగా ఖరారు అయిన తర్వాత తన వ్యూహాలను ప్రణాళిక ప్రకారం అమలు చేశారు. గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల్లోని ఎంపీటీసీలు, జడ్పిటిసిలను బెంగుళూరులోని క్యాంపుకు తరలించారు. దీంతో వైసీపీకి చెందిన నాయకులతో టిడిపి ముఖ్య నేతలు సంప్రదింపులు చేసేందుకు అవకాశం లేకుండా పోయింది. అదే సమయంలో వైసీపీకి చెందిన మాజీ మంత్రులు బూడి ముత్యాల నాయుడు, గుడివాడ అమర్నాథ్ ఈ ఎమ్మెల్సీ స్థానాన్ని ఆశించారు. అయితే బొత్స సత్యనారాయణకు ఖరారు చేసిన తర్వాత వీరు కూడా ఎటువంటి అసంతృప్తిని వ్యక్తం చేయలేని పరిస్థితి ఏర్పడింది. ప్రచారం నిమిత్తం ఆయా నియోజకవర్గాలకు వెళ్ళినప్పుడు బొత్స వెంట ఈ ఇద్దరు నేతలు కూడా తప్పనిసరిగా ఉంటూ వచ్చారు. దీంతో పార్టీ నేతలు అంతా ఉమ్మడిగా పనిచేస్తున్నారు అనే భావన ఎంపీటీసీలు, జడ్పిటిసిలకు కలిగింది. ఈ తరుణంలో పార్టీకి అండగా ఉండాలన్న అభిప్రాయాన్ని కూడా కలిగించడంలో బొత్స సత్యనారాయణ విజయం సాధించారు. ఇవన్నీ ఎమ్మెల్సీ స్థానాన్ని ఏకగ్రీవంగా గెలుచుకునేందుకు దోహదం చేశాయి. ఒకరకంగా చెప్పాలంటే మాజీమంత్రి బొత్స సత్యనారాయణ రాజకీయ చాతుర్యమే ఈ ఎమ్మెల్సీ స్థానాన్ని వైసీపీకి కట్టబెట్టినట్లు చెబుతున్నారు.
పార్టీని బలంగా ముందుకు తీసుకెళ్లే అవకాశం
ఉత్తరాంధ్ర పార్టీ బాధ్యతలను ఆ ఉద్దేశంతోనే వైయస్ జగన్మోహన్ రెడ్డి బొత్స సత్యనారాయణకు అప్పగించే ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు. మూడు జిల్లాల్లో బొత్స సత్యనారాయణకు బలమైన అనుచరగణం ఉంది. క్షేత్రస్థాయిలోనే నాయకులు, కార్యకర్తలతో కూడా ఆయనకు సత్ససంబంధాలు ఉన్నాయి. ఇవన్నీ బొత్స సత్యనారాయణ కు పార్టీ బాధ్యతలను అప్పగించేలా చేస్తున్నట్లు చెబుతున్నారు. వైవి సుబ్బారెడ్డి స్థానాన్ని బొత్సకు అప్పగించి.. వై వి సుబ్బారెడ్డికి ఢిల్లీలో కీలక బాధ్యతలను జగన్మోహన్ రెడ్డి అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది. అదే జరిగితే ఉత్తరాంధ్ర ప్రాంతంలో వైసిపి సరికొత్త రాజకీయాలను అనుసరించే అవకాశం ఉందని తెలుస్తోంది. బొత్స సూచనతోనే టెక్కలి వైసిపి ఇన్చార్జిగా దువ్వాడ శ్రీనివాసును మార్చినట్లు చెబుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత తీవ్రమైన ఇబ్బందుల్లో పడిన వైసీపీని ఒడ్డున చేర్చే పనిని జగన్మోహన్ రెడ్డి చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ సంస్కరణలను ఉత్తరాంధ్ర నుంచే అమలు చేసేందుకు ఆయన సిద్ధపడుతున్నట్లు చెబుతున్నారు.