రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామోహన్‌నాయుడు శుభవార్త చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని చోట్ల ఎయిర్‌పోర్టులు కట్టనున్నట్టు ఆయన వెల్లడించారు. ఏపీలోని ఓర్వకల్లు, దగదర్తి, నాగార్జున సాగర్, కుప్పంలో ఎయిర్‌పోర్టులు త్వరలో నిరిస్తామన్నారు. వీటితోపాటు తెలంగాణలో కూడా కొత్త ఎయిర్‌పోర్టులు నిర్మిస్తామని మంత్రి స్పష్టం చేశారు.
కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామోహన్‌నాయుడు
రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామోహన్‌నాయుడు శుభవార్త చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని చోట్ల ఎయిర్‌పోర్టులు కట్టనున్నట్టు ఆయన వెల్లడించారు. ఏపీలోని ఓర్వకల్లు, దగదర్తి, నాగార్జున సాగర్, కుప్పంలో ఎయిర్‌పోర్టులు త్వరలో నిరిస్తామన్నారు. వీటితోపాటు తెలంగాణలో కూడా కొత్త ఎయిర్‌పోర్టులు నిర్మిస్తామని మంత్రి స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా ఎయిర్‌పోర్టులను త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. దేశ వ్యాప్తంగా అనేక ప్రాంఆల్లో కొత్త ఎయిర్‌పోర్టులను త్వరలోనే నిర్మిస్తామన్నారు. విజయనగరం జిల్లాలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఉత్తరాంధ్ర రూపు రేఖలను మార్చే శక్తిగా భోగాపురం ఎయిర్‌పోర్టు మారుతుందన్నారు. 2026 జూన్‌లోగా ఎయిర్‌పోర్టు ప్రారంభించాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్నట్టు వివరించారు. ప్రాజెక్ట్ పనులను త్వరితగతిన సాగుతున్నాయన్న కేంద్ర మంత్రి.. ప్రతినెల ఎయిర్‌పోర్టు పనులను పరిశీలించి వేగవతం చేయనున్నట్టు వివరించారు. ఇప్పటి వరకు 36.6 శాతం పనులు పూర్తి అయ్యాయన్న కేంద్ర మంత్రి.. అనుకున్న సమయానికి ముందే పనులు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఉదాన్ స్కీమ్ వల్ల భారతదేశ విమానయానశాఖ ప్రపంచంలోనే ఉన్నతంగా తయారైందని స్పష్టం చేవారు. కొత్త ఎయిర్‌పోర్టులు ఏర్పాటుతో రెండు రాష్ట్రాలు మరింతగా అభివృద్ధి చెందుతాయన్న ఆశాభావాన్ని మంత్రి వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం దేశంలోని అనేక ప్రాంతాల్లో నూతన ఎయిర్ పోర్టులు నిర్మాణానికి ప్రత్యేకంగా శ్రద్ధ చూపిస్తున్నట్టు వెల్లడించారు.