అక్టోబర్ నుంచే పేపర్ లీకులు.. ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి బాగోతాలు

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||టీఎస్‌పీఎస్సీ కార్యాలయం||


తెలంగాణ వ్యాప్తంగా సంచలన సృష్టిస్తున్న టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజ్ కేసు సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ కేసులో A1 ప్రవీణ్, A2 రాజశేఖర్ తో పాటు మరో 9 మంది నిందితులను కస్టడీలోకి తీసుకున్నారు. అయితే పేపర్ లీక్ వ్యవహారంలో తీవ్ర సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. టీఎస్‌పీఎస్సీ అక్టోబర్ నుండి నిర్వహించిన పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయని దర్యాప్తులో వెల్లడైంది. అయితే టీఎస్‌పీఎస్సీ అక్టోబర్ నుండి ఇప్పటివరకు 7 పరీక్షలను నిర్వహించింది. అందులో గ్రూప్-1 ప్రిలిమ్స్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, CDPO, సూపర్వైజర్ గ్రేడ్-2, AEE, DAO, AE ఉన్నాయి. అయితే ఇప్పటివరకు గ్రూప్-1, AEE, DAO, AE పరీక్షలను టీఎస్‌పీఎస్సీ రద్దు చేయగా, మిగితా 3 పరీక్షలను కూడా రద్దు చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ నేపథ్యంలో 46 వేల మంది మహిళలకు అన్యాయం జరుగుతోందని సీపీడీవో, ఈవో పరీక్షలు రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.  

ఇక టీఎస్‌పీఎస్సీ కార్యాలయానికి ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి లను దర్యాప్తు కోసం విచారించగా కంప్యూటర్లను హ్యాక్ చేసి సమాచారాన్ని ఎలా ఉపయోగించారనే టెక్నికల్ విషయాలపైన సిట్ నిగ పెట్టింది. అయితే ఈ దర్యాప్తులో ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి నుండి వేరు వేరు సమాధానాలు బయటకు వస్తున్నాయి. దీంతో వారి మొబైల్ లను స్వాధీనం చేసుకొని సమాచారం కోసం దర్యాప్తు మొదలుపెట్టారు. కేసును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రశ్నాపత్రం ఎలా హ్యాక్ చేసి పాస్‌వర్డ్ ఎవరు ఇచ్చారని నిలదీయగా, ప్రవీణ్ పాస్‌వర్డ్ ఇచ్చాడని రాజశేఖర్ వివరించారు. కానీ, ప్రవీణ్ మాత్రం శంకర్ లక్ష్మి డైరీలో నుండి పాస్‌వర్డ్ తీసుకున్నానని తెలిపారు. వీరిద్దరి మాటలు వేరువేరుగా ఉండడంతో శంకర్ లక్ష్మి దర్యాప్తు చేయగా అసలు డైరీలో ఎలాంటి పాస్‌వర్డ్ రాయలేదని శంకర్ లక్ష్మి వివరించారు. అయితే పేపర్ ఎలా లీక్ అయిందో అని సైబర్ నిపుణులు దర్యాప్తు చేయగా అంతుచిక్కడం లేదని సమాచారం.. అలాగే 2017న టీఎస్‌పీఎస్సీలో రాజశేఖర్ రెడ్డి ఉద్యోగంలోకి వచ్చినప్పటినుండి అతడి జీవితం చాలా మారింది అంటూ జగిత్యాల జిల్లా తాటిపెళ్లి రాజశేఖర్ రెడ్డి గ్రామస్తులు తెలిపారు. రాజశేఖర్ రెడ్డి కి కంప్యూటర్ హార్డ్ వేర్ లో నిపుణుడు అని ఈ పని పై ఆఫ్గనిస్తాన్ వెల్లాడని అలాగే తమ బంధువులకి కూడా గతంలో ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పించాడని తెలుస్తోంది. రాజశేఖర్ రెడ్డి 2017 నుండి ఆయన సంపాదన, ఆస్తులు పెరిగాయని ఇవన్నీ ఎలా వచ్చాయని దానిపైన దర్యాప్తు మొదలుపెట్టారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్