అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాజాగా సంచలనం నిర్ణయం తీసుకున్నారు ఆయన గ్రీన్ కార్డు లాటరీ ప్రోగ్రామ్ పూర్తిగా నిలిపివేశారు. ప్రతి ఏడాది 50 వేల గ్రీన్ కార్డు వీసాలను లాటరీ ద్వారా ఎంపిక చేసి అమెరికాలో నివాసం ఉండేందుకు స్థానం కల్పిస్తుంటారు.
డోనాల్డ్ ట్రంప్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయం
ప్రవాస భారతీయులపై ప్రభావం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాజాగా సంచలనం నిర్ణయం తీసుకున్నారు ఆయన గ్రీన్ కార్డు లాటరీ ప్రోగ్రామ్ పూర్తిగా నిలిపివేశారు. ప్రతి ఏడాది 50 వేల గ్రీన్ కార్డు వీసాలను లాటరీ ద్వారా ఎంపిక చేసి అమెరికాలో నివాసం ఉండేందుకు స్థానం కల్పిస్తుంటారు. ముఖ్యంగా ఈ స్కీం ఉద్దేశం అమెరికాలో తక్కువ ప్రాతినిధ్యం ఉన్నటువంటి దేశాల నుంచి వచ్చే వారికి స్థానం కల్పించేందుకు, వారి నైపుణ్యాన్ని వాడుకునేందుకు ఈ వీసా విధానం ప్రవేశపెట్టారు. ఇందులో పలు ఆఫ్రికా దేశాలకు చెందిన వారు కూడా ఈ స్కీం ద్వారా లబ్ధి పొందుతున్నారు. అయితే తాజాగా బ్రౌన్ యూనివర్సిటీలో జరిగిన కాల్పుల ఘటనలో ఇద్దరు మృతి చెందారు. అయితే ఈ కాల్కులకు పాల్పడినటువంటి నిందితుడు పోర్చుగీసు దేశానికి చెందిన వాడని అతను గ్రీన్ కార్డు సిస్టం ద్వారా అమెరికాలోకి ప్రవేశించినట్లు గుర్తించారు. దీంతో ట్రంప్ ఈ గ్రీన్ కార్డు విధానం పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఈ ప్రోగ్రాం లో నిలిపివేయాలని యుఎస్ సిటిజెన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్ కు ఆదేశాలు జారీ చేశారు. ఆయన ఆదేశం మేరకు అమెరికా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టి నోయిమ్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ లో ప్రకటన చేశారు. ఆ ప్రకటనలో అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాల మేరకు యునైటెడ్ స్టేట్స్ సిటిజెన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్‌కు గ్రీన్ కార్డు లాటరీ ప్రోగ్రామ్‌ను తాత్కాలికంగా ఆపేయాలని ఆదేశించినట్లు పోస్టులో తెలిపారు. కాల్పులకు పాల్పడిన నిందితుడు 48 సంవత్సరాల క్లాడియో నెవెస్ వాలెంటే, పోర్చుగీసు పౌరుడిగా గుర్తించారు. రోడ్ ఐలాండ్ లో ప్రోవిడెన్స్ ఇంజనీరింగ్ భవనంలో డిసెంబర్ 13న జరిగిన కాల్పుల్లో ఇద్దరు విద్యార్థులకు మరణించగా, తొమ్మిది మంది గాయపడ్డారు. ఆ తర్వాత డిసెంబర్ 15వ తేదీన బోస్టన్ నగరం సమీపంలోని బ్రూక్ లైన్ లో ఒక ఇంటి వద్ద జరిపిన కాల్పుల్లో 47 సంవత్సరాల ఎంఐటి ప్రొఫెసర్ లౌరిరో మరణించినట్లు గుర్తించారు. ఈ రెండు ఘటనల వెనుక పోర్చుగల్ దేశానికి చెందిన 48 సంవత్సరాల క్లాడియో నెవెస్ వాలెంటే ను నిందితుడిగా గుర్తించారు. ఇతడు 2017లో గ్రీన్ కార్డ్ లాటరీ ద్వారా అమెరికాకు వచ్చాడు. అయితే డోనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం భారతీయుల్లో ఆందోళన నింపుతోంది. ఎందుకంటే వేల మంది భారతీయులు గ్రీన్ కార్డు కోసం అమెరికాలో స్థిరనివాసం ఏర్పాటు చేసుకోవడానికి ఎదురు చూస్తూ ఉంటారు. అయితే, తాజాగా ఈ గ్రీన్ కార్డు ప్రోగ్రాంను తాత్కాలికంగా నిలిపివేయడం అనేది నేరుగా అంత ప్రత్యక్ష ప్రభావం ఉండకపోవచ్చు అని విదేశాంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ వీసా ప్రోగ్రాం లో 2028 వరకు గ్రీన్ కార్డ్ లాటరీకి భారతీయులు అర్హులు కాదు. కాబట్టి ఇది తాత్కాలికమైన నిలిపివేత కావున భవిష్యత్తులో అప్లై చేసుకునే వారిపైన నేరుగా ప్రభావితం చేయదని పేర్కొంటున్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న రూల్స్ రీత్యా చూస్తే భారతీయులు ఈ ప్రోగ్రామ్‌కు అర్హులు కాదు. ఎందుకంటే భారత్, చైనా, మెక్సికో, ఫిలిప్పీన్స్ నుంచి ప్రతి ఏడాది 50 వేల కంటే ఎక్కువ మంది ఇమ్మిగ్రెంట్స్ అమెరికా వస్తున్నారు. గత 5 సంవత్సరాల్లో అమెరికాకు 50 వేల మంది కంటే తక్కువ ఇమ్మిగ్రెంట్లను పంపిన దేశాలకు మాత్రమే గ్రీన్ కార్డు అప్లై చేసుకునేందుకు అవకాశం ఉంది. గత 5 సంవత్సరాల డేటా ప్రకారం.. ఈ గ్రీన్ కార్డు లాటరీకి భారతీయులు అర్హులు కారు. 2021లో 93,450 భారతీయులు అమెరికాలో ప్రవేశించగా, 2022లో సుమారు 1,27,010 మంది. అలాగే 2023లో 78,070 మంది అమెరికాలో ప్రవేశించారు. ఈ నేపథ్యంలో భారతీయులు సుమారు 2028- 29 వరకూ ఈ గ్రీన్ కార్డు లాటరీ కి అర్హులు కాదని రికార్డులు చెప్తున్నాయి.