అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది ప్రధాన పార్టీల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ తన ప్రత్యర్థులైన ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షులు కమలా హారస్ ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ఇటీవల అధ్యక్ష అభ్యర్థి మార్పిడిపై డెమొక్రటిక్ పార్టీలో చర్చ మొదలైన నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు అర్థమవుతోంది.
ట్రంప్
అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది ప్రధాన పార్టీల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ తన ప్రత్యర్థులైన ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షులు కమలా హారస్ ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ఇటీవల అధ్యక్ష అభ్యర్థి మార్పిడిపై డెమొక్రటిక్ పార్టీలో చర్చ మొదలైన నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు అర్థమవుతోంది. జూన్ 27వ తేదీన జరిగిన చర్చ కార్యక్రమంలో బైడెన్ ప్రదర్శనపై సొంత పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. తాజాగా ట్రంప్ మాట్లాడుతూ వంకర బుద్ధి బైడెన్ ఒక విషయంలో మెచ్చుకోవచ్చన్నారు. కమలా హారిస్ ను తన ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంపిక చేసుకోవడం అతడు జీవితంలో తీసుకున్న అద్భుతమైన నిర్ణయంగా పేర్కొన్నారు. అదే అతనికి బెస్ట్ ఇన్సూరెన్స్ పాలసీ కావచ్చని వ్యాఖ్యానించారు. కనీసం సగం సమర్ధుడిని అయినా ఎంపిక చేసుకుని ఉంటే, కొన్నేళ్ళ క్రితమే బైడెన్ వారు ఆఫీస్ నుంచి సాగనంపేవారన్నారు. కానీ ఇప్పుడు కమలా ఆ స్థానంలో ఉండటంతో ఇక ఎవరూ పంపలేరని ఎద్దేవా చేశారు. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కు ప్రభుత్వంలో రెండు కీలక అంశాలు అప్పజెప్పారని ట్రంప్ వెల్లడించారు.
వీటిలో ఒకటి బోర్డర్ సెక్యూరిటీ కాగా, రెండోది ఉక్రెయిన్ పై దాడి చేయకుండా రష్యాను భయపెట్టి ఆపడం అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇక సరిహద్దు రక్షణ బాధ్యతలు చేపట్టాక ఆమె చేసింది ఏమీ లేదన్నారు. కనీసం బోర్డర్ కూడా వెళ్లలేదని ట్రంప్ ఆరోపించారు. భూ ప్రపంచంలో అత్యంత చెత్త సరిహద్దులుగా మారిపోయాయని ట్రంప్ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు. తన పాలనలో వాటిని అద్భుతంగా కాపాడినట్లు ఈ సందర్భంగా ట్రంప్ గుర్తు చేశారు. ఉక్రెయిన్ పై దాడిన ఆపేందుకు కమలా హారిస్ ను ఐరోపాకు పంపించారని, అయినప్పటికీ ఏమాత్రం ప్రయోజనాన్ని ఇవ్వలేదని వెల్లడించారు. కమలా హారిస్, బైడెన్ సరిహద్దుల రక్షణ విషయంలో తీవ్రంగా విఫలమయ్యారని విమర్శించారు. వీరిద్దరి కారణంగా కొన్ని లక్షల మంది పిల్లల జీవితాలు నాశనం అయ్యాయని పేర్కొన్నారు. ఎన్నికల దగ్గర పడుతున్న కొద్ది ట్రంప్ తన వ్యాఖ్యల తీవ్రతను పెంచుతూ వస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ట్రంప్ తీవ్ర స్థాయిలో పదునైన విమర్శలను గుప్పిస్తున్నారు. రానున్న రోజుల్లో ఇరు పార్టీల వైపు ఈ వ్యాఖ్యలు తీవ్రత పెరిగే ఛాన్స్ ఉందని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.