||రేవంత్ రెడ్డి Photo: Twitter||
జనగామ జిల్లాలో లోని స్టేషన్ ఘనపూర్ లో నిర్వహించిన హాథ్ సే హాథ్ జోడో యాత్ర కార్యక్రమంలో భాగంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చి అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ రావడానికి కారణమైన కాంగ్రెస్ పార్టీని ఎందుకు ఓడించారని రేవంత్ రెడ్డి ప్రశ్నించాడు. ముఖ్యమంత్రి కెసీఆర్ అధికారంలో ఉన్నంతకాలం ప్రజలకు నష్టం జరుగుతుందని, హామీ ఇచ్చిన డబ్బులు బెడ్ రూమ్ ఇల్లు జాడ లేకుండా పోయాయని విమర్శించారు. ఉద్యమకారుడు అంటూ మాటలు చెబుతూ ప్రజలను మోసం చేస్తూ తాను మాత్రం వందలాది ఎకరాల్లో ఫామ్ హౌజ్ లు ఏర్పాటు చేసుకొని విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. టిఆర్ఎస్, బిజెపి ఇద్దరు మిత్రులే.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలందరికీ సమన్యాయం చేస్తానని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. తెలంగాణ రావడానికి కారణమైన కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇస్తే యువతకు, గీత కార్మికులకు, డాక్రా మహిళలకు, రైతులకు రెండు లక్షల రుణమాఫీ, ఇందిరమ్మ ఇండ్లకు అర్హులైన వారికి ఐదు లక్షలు, మహిళలకు 500 కి సిలిండర్ ఇప్పిస్తామని, ఆరోగ్యశ్రీ రెండు లక్షల నుండి 5 లక్షలకు పెంచుతామని బహిరంగ సభలో రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.