తాజాగా మంచు మనోజ్ కూడా ఇదే విధమైన ట్వీట్ చేశారు. పిల్లలపై నీచమైన కామెంట్స్ చేసేవారు సమాజానికి ప్రమాదకరమంటూ మనోజ్ ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. అటువంటి వారిపట్ల కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. పిల్లల భద్రత విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. పిల్లలపై అసభ్యంగా కామెంట్స్ చేసిన ఒక వ్యక్తికి ఈ సందర్భంగా మంచు మనోజ్ వార్నింగ్ ఇచ్చారు. చిన్నారుల విషయంలో అసహ్యంగా ప్రవర్తిస్తూ నీచంగా వీడియోలు చేసే వారిని చూస్తే భయంతోపాటు అసహ్యమేస్తోందన్నారు.
మంచు మనోజ్
చిన్నారుల భద్రతపై టాలీవుడ్ నటులు వరుసగా స్పందిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసే చిన్నారుల ఫోటోలు పట్ల అసభ్యంగా కామెంట్లు చేయడంతోపాటు వారి భద్రతకు ప్రమాదం వాటిల్లేలా పలువురు వ్యవహరిస్తున్నారంటూ సినీ నటులు పేర్కొంటున్నారు. ప్రశ్నార్ధకంగా మారిన చిన్నారుల భద్రతకు సంబంధించి రెండు రోజుల కిందట నటుడు సాయిధరమ్ తేజ్ ట్విట్టర్లో ట్వీట్ చేయగా, తాజాగా మంచు మనోజ్ కూడా ఇదే విధమైన ట్వీట్ చేశారు. పిల్లలపై నీచమైన కామెంట్స్ చేసేవారు సమాజానికి ప్రమాదకరమంటూ మనోజ్ ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. అటువంటి వారిపట్ల కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. పిల్లల భద్రత విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. పిల్లలపై అసభ్యంగా కామెంట్స్ చేసిన ఒక వ్యక్తికి ఈ సందర్భంగా మంచు మనోజ్ వార్నింగ్ ఇచ్చారు. చిన్నారుల విషయంలో అసహ్యంగా ప్రవర్తిస్తూ నీచంగా వీడియోలు చేసే వారిని చూస్తే భయంతోపాటు అసహ్యమేస్తోందన్నారు. హాస్యం ముసుగులో సోషల్ మీడియాలో ఈ తరహా పనులు చేస్తున్నారని, అటువంటి వారి ప్రవర్తన ప్రమాదకరమైందని వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లో పిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలను ఎదుర్కొనేందుకు తాను ఏడాది క్రితమే ఇన్ స్టా ద్వారా ఒక వ్యక్తిని సంప్రదించినట్లు వెల్లడించారు. కానీ, అతడి నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. తాజాగా అదే వ్యక్తి సోషల్ మీడియాలో పిల్లలపై నీచమైన కామెంట్స్ చేస్తున్నాడన్నారు. పిల్లలు, మహిళల రక్షణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని మనోజ్ స్పష్టం చేశారు. దయచేసి ఇలాంటి వారిని ఉపేక్షించవద్దంటూ తెలుగు రాష్ట్రాల పోలీసులకు ఈ సందర్భంగా మనోజ్ విజ్ఞప్తి చేశారు. ఇటువంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అమెరికాలోని ఇండియన్ ఎంబసీ అధికారులను ఆయన కోరారు. ఒక వ్యక్తిని ఉద్దేశిస్తూ 'అమ్మతోడు నిన్ను వదిలిపెట్టను' అని వార్నింగ్ కూడా ఇచ్చారు మంచు మనోజ్. ప్రస్తుతం ఈ పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
టాలీవుడ్ నటులు ఆందోళన వెనక కారణం ఇదే..
చిన్నారుల భద్రతపై సినీ నటులు వరుసగా స్పందిస్తున్నారు. వీరి ఆవేదన వెనుక బలమైన కారణాలు ఉన్నట్లు చెబుతున్నారు. ఈ మధ్యకాలంలో సామాజిక మాధ్యమాలు వేదికగా చిన్నారులను అసభ్య పదజాలంతో దూషించడం, అసభ్యమైన వీడియోలు రూపొందించి పోస్ట్ చేయడం వంటివి జరుగుతున్నాయి. ఈ తరహా వ్యవహారాలకు అడ్డుకట్టు వేసే ఉద్దేశంతోనే సామాజిక బాధ్యతగా సినీనటులు స్పందిస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు ప్రముఖు నటులు ఈ వ్యవహారంపై స్పందించగా మిగిలినవారు స్పందించే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. సినీ నటులు స్పందిస్తేనే ఇటువంటి సమస్యలు పట్ల ప్రజలకు అవగాహన ఏర్పడడంతోపాటు పోలీసులు కూడా వేగంగా స్పందించేందుకు అవకాశం ఉంటుందని పలువురు చెబుతున్నారు.