ఏపీలో మూడు కొత్త విమానాశ్రయాలు : బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి

రాష్ట్రంలో మూడు కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ పురందేశ్వరి పేర్కొన్నారు. ఎక్స్ వేదికగా ఆమె బుధవారం ఈ వివరాలను వెల్లడించారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏ అధికారంలో ఉండడంతో ఏపీలో అభివృద్ధి కార్యక్రమాలు జోరందుకున్నాయన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం, శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా దగదర్తి, శ్రీకాకుళం జిల్లా మూలపేటలో కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు చేయగలుగుతున్నామని స్పష్టం చేశారు.

BJP state president Purandeshwari

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి 

రాష్ట్రంలో మూడు కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ పురందేశ్వరి పేర్కొన్నారు. ఎక్స్ వేదికగా ఆమె బుధవారం ఈ వివరాలను వెల్లడించారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏ అధికారంలో ఉండడంతో ఏపీలో అభివృద్ధి కార్యక్రమాలు జోరందుకున్నాయన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం, శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా దగదర్తి, శ్రీకాకుళం జిల్లా మూలపేటలో కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు చేయగలుగుతున్నామని స్పష్టం చేశారు. అభివృద్ధి కనెక్టివిటీ పెంపుతో పాటు ఆర్థిక పురోగతికి కూడా ప్రోత్సాహాన్ని అందిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహాయ, సహకారాలను అందిస్తోందని ఆమె వెల్లడించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకు అనుగుణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వెళుతున్నాయన్నారు. అలాగే, సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చిన్న ఎయిర్ పోర్టులు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆమె వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో భోగాపురం విమానాశ్రయ పనుల్లో వేగం పెరిగింది. సీఎం ఇటీవల అక్కడ పనులు జరుగుతున్న తీరును కూడా పరిశీలించారు. ఈ క్రమంలోనే పురందేశ్వరి తాజాగా చేసిన పోస్టు మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. రాష్ట్రంలో కొత్త ఎయిర్ పోర్టులు రావడం ద్వారా అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతుందన్న విశ్లేషణలు వస్తున్నాయి. రాష్ట్రంలో బిజెపితో కూడిన ప్రభుత్వం ఏర్పాటు కావడం వల్ల ఆర్థికంగా రాష్ట్ర పురోభివృద్ధికి కొన్ని కీలక ప్రాజెక్టులు తెచ్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం ఏర్పడుతుందన్న భావన నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా తాజాగా పురందేశ్వరి చేసిన మూడు విమానాశ్రయాలు ఏర్పాటు పోస్టు ప్రస్తుతం రాజకీయంగా ఆసక్తిని కలిగిస్తోంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్