మహబూబ్‌నగర్‌లో ముగ్గురు శ్రీనివాస్‌ల పోటీ.. గెలుపు ఏ శ్రీనివాస్‌దో?

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||మహబూబ్‌నగర్‌లో ముగ్గురు శ్రీనివాస్‌ల పోటీ||

(ఈవార్తలు, రంగారెడ్డి ప్రతినిధి, అక్కినేపల్లి పురుషోత్తమరావు)

మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ముగ్గురు శ్రీనివాసులు బరిలో నిలిచారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి డాక్టర్ శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నుండి యెన్నం శ్రీనివాసరెడ్డి, స్వతంత్ర అభ్యర్థి మెట్టుకాడి శ్రీనివాసులు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. ఎవరి గెలుపు ధీమా వారికే ఉంది. ప్రభుత్వ వాగ్దానాలు వైఫల్యాలపై కాంగ్రెస్ అభ్యర్థి యెన్నం శ్రీనివాసరెడ్డి, స్వతంత్ర అభ్యర్థి మెట్టు కాడి శ్రీనివాసులు ప్రజలకు వివరిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నేటికీ నెరవేరలేదని వారు విమర్శలు గుప్పిస్తున్నారు. బంగారు తెలంగాణ తెచ్చుకున్నది ఎందుకోసం అని ప్రశ్నిస్తున్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు ఎక్కడ అని ప్రజలకు ఇంటింటికి తిరుగుతూ ముమ్మరంగా ప్రచారం చేస్తూ మెట్టుకాడి శ్రీనివాస్ ప్రచారం కొనసాగిస్తున్నారు.

లోకల్ అభ్యర్థిగా తనకు అవకాశం ఇవ్వండి: మెట్టుకాడి శ్రీనివాస్

లోకల్ అభ్యర్థి బీసీ, ముదిరాజు ముద్దుబిడ్డకు మహబూబ్‌నగర్ అసెంబ్లీ ఎన్నికల్లో పట్టం కట్టాలని మెట్టుకాడి శ్రీనివాస్ ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. రెండుసార్లు భారత రాష్ట్ర సమితిని గెలిపించుకున్నామని, ఈసారి ఎన్నికలలో లోకల్ అభ్యర్థిగా తనను గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు. నియోజకవర్గంలోని ప్రజల సమస్యలు తనకు తెలుసునని ప్రతి గల్లీ తనకు తెలుసునని గల్లీలో ఉన్న సమస్యలు తెలుసుకుని ఆ సమస్యలకు పరిష్కారం కూడా తన దగ్గర ఉందని మెట్టు కాడి శ్రీనివాస్ నియోజకవర్గ ప్రజలను అభ్యర్థిస్తున్నారు. రాష్ట్ర బీసీ నేతగా ముదిరాజు నేతగా ఎల్లప్పుడూ పాలమూరు ప్రజల మధ్యలో ఉంటున్నానని తెలుపుతున్నారు. నియోజకవర్గ ప్రజల సమస్యలు తనకు తెలుసు లోకల్ అభ్యర్థిని గెలిపించడం ద్వారా అనేక సమస్యలు పరిష్కరిస్తానని, ఒక్కసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.

ఈ పది సంవత్సరాల నుండి తెలంగాణ ఇంకా వెనుకబడిపోయిందని నీళ్లు నియామకాలు ఊసే లేదని ఎక్కడ చూసినా వలసలు నిరుద్యోగం పెరిగిందని ఆరోపించారు. దీనికంతటికి పాలక ప్రభుత్వమే కారణమని ఆవేదన వ్యక్తం చేశారు. చేసిన వాగ్దానాల అమలు ఎందుకు చెయ్యలేదు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేస్తున్నారు. కెసిఆర్ ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండా ఇంకా ఎన్నిసార్లు ప్రజలను మోసం చేస్తారని ఆరోపించారు. ధరంలో అనేక రకాల ప్రజల ఇబ్బందులే తప్ప లాభం లేదని తెలిపారు. ఏ సంక్షేమ పథకంలో కూడా పారదర్శకత స్పష్టత లేదని అన్నింటిలో కూడా అర్హులైన ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వెల్లడించారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే పథకాలు ఎందుకని ప్రశ్నించారు ప్రజల వద్దకే పాలన రావాలని మెట్టు కాడి శ్రీనివాస్ కోరుతున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్