ఆ రెండు పథకాలు అమలుపై స్పష్టత కరువు.. ఇప్పట్లో అమలు లేనట్టేనా..!

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత పలు పథకాల అమలు కోసం ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో విజయం కోసం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల సమయంలో అనేక వాగ్దానాలు చేశారు. ఆ ఎన్నికల్లో కూటమి అద్భుత విజయాన్ని నమోదు చేసుకుంది. 164 స్థానాల్లో కూటమి నేతలు విజయం సాధించారు. దీంతో కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పాటయింది.

Chief Minister Nara Chandrababu Naidu

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత పలు పథకాల అమలు కోసం ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో విజయం కోసం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల సమయంలో అనేక వాగ్దానాలు చేశారు. ఆ ఎన్నికల్లో కూటమి అద్భుత విజయాన్ని నమోదు చేసుకుంది. 164 స్థానాల్లో కూటమి నేతలు విజయం సాధించారు. దీంతో కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పాటయింది. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టగా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయి దాదాపు రెండు నెలలు పూర్తికా వస్తోంది. దీంతో ఎన్నికల సమయంలో ఇచ్చిన పలు హామీలు కోసం లబ్ధిదారులు ఆశగా ఎదురుచూస్తున్నారు. వీటిలో అత్యంత కీలకమైనది మహిళలకు ఉచిత బస్సు. ఈ పథకాన్ని ఆగస్టు 15 నుంచి అమలు చేస్తామని తొలుత కూటమి నేతలు చెబుతూ వచ్చారు. అందుకు అనుగుణంగానే బస్సులు కొనుగోలు చేసినట్లు ప్రచారం జరిగింది. కానీ ఇంతలో ఏం జరిగిందో తెలియదు కానీ ఈ పథకాన్ని మాత్రం అమలు చేయలేదు.

అన్నా క్యాంటీన్లను మాత్రమే ప్రారంభించి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. ఉచిత బస్సు గురించి మంత్రులను మీడియా ప్రతినిధులు అనేక సందర్భాల్లో అడిగిన స్పష్టమైన సమాధానం మాత్రం రాలేదు. దీంతో చాలామంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం ఎప్పటి నుంచి ప్రారంభిస్తారు అని ప్రశ్నలు కురిపిస్తున్నారు. అలాగే ఎక్కువ మంది లబ్ధిదారులు ఎదురుచూస్తున్న మరో హామీ నిరుద్యోగులకు అందిస్తామని కూటమి నేతలు చెప్పిన నిరుద్యోగ భృతి. నిరుద్యోగులకు ప్రతి నెల రూ.3000 వరకు నిరుద్యోగ భృతి అందిస్తామని కూటమి హామీ ఇచ్చింది. ఈ హామీని ఎప్పటినుంచి అమలు చేస్తారో అన్నదానిపై స్పష్టత లేకుండా పోయింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది నిరుద్యోగులు ప్రభుత్వం ఈ హామీని ఎప్పటి నుంచి అమలు చేస్తుందో అని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ హామీని అమలు చేస్తే తమలాంటి ఎంతోమంది నిరుద్యోగులు మరింతకాలం ప్రభుత్వ ఉద్యోగాల కోసం చదువుకునే స్వేచ్ఛ లభిస్తుందని పలువురు పేర్కొంటున్నారు. ఈ పథకాన్ని అమలు చేయడంపైన ప్రభుత్వం ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదు. నైపుణ్య గణన చేపట్టిన తరువాతే ఈ పథకం అమలు ఉంటుందనే ప్రచారము జరుగుతోంది. నైపుణ్య గణన ఎప్పుడు ప్రారంభమవుతుందో, ఎప్పటికీ పూర్తవుతుందో తెలియని పరిస్థితి నెలకొందని, నైపుణ్య గనణతో నిరుద్యోగ భృతి కి లింకు పెట్టడం తగదు అని పలువురు పేర్కొంటున్నారు. చూడాలి వీటితోపాటు మిగిలిన పథకాలను కూటమి ప్రభుత్వం ఎప్పటి నుంచి అమలు చేస్తుందో మరి.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్