వైసిపి ప్రభుత్వం నిర్వాకంతో అనేక రంగాల్లో తీవ్ర ఇబ్బందులు : మంత్రి నారాయణ

గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం, నిర్వాకంతో రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో తాగునీటి, సీవరేజ్ ప్రాజెక్టులన్నీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉన్నాయని మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు నాయుడుతో చర్చించి ఈ ప్రాజెక్టుల కోసం రాష్ట్ర వాటా విడుదల చేసి ప్రాజెక్టులను తిరిగి గాడిలో పెట్టేలా చర్యలు తీసుకుంటామన్నారు. జూలై చివరి నాటికి 123 పట్టణ స్థానిక సంస్థల్లో కాలువల్లో పూడిక తీసేందుకు రూ.50 కోట్లు ఖర్చు చేయనున్నట్లు నారాయణ వివరించారు.

Minister Ponguru Narayana

మంత్రి పొంగూరు నారాయణ


గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం, నిర్వాకంతో రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో తాగునీటి, సీవరేజ్ ప్రాజెక్టులన్నీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉన్నాయని మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. మున్సిపల్, పట్టణ అభివృద్ధిశాఖ అధికారులు, 17 మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. వైసీపీ సర్కార్ రాక మునుపు పట్టణ ప్రాంతాల్లో తాగునీటి వనరుల అభివృద్ధి, మురుగునీటి వ్యవస్థ పటిష్టం, ప్రతి ఇంటికి కులాయి నీరు అందించే ఏర్పాట్లు చేసేందుకు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు (ఏఐఐబి) నుంచి రూ.5300 కోట్లు రుణం 2019 ఫిబ్రవరిలో తీసుకున్నామన్నారు. వైసీపీ సర్కారు వచ్చిన తర్వాత ప్రాజెక్టుకు అవసరమైన రాష్ట్ర వాటా చెల్లించకపోవడం, టెండర్లు పిలిచిన పనులు అప్పగించడంలో జాప్యం చేయడం, చేసిన పనులకు బిల్లులు ఇవ్వకుండా ఆలస్యం చేయడంతో ఐదేళ్లలో రూ.429 కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు. దీంతో రాష్ట్రానికి రావాల్సిన నిధులు నిలిచిపోయాయని మంత్రి పేర్కొన్నారు. మున్సిపల్ శాఖలో ఆగిపోయిన పనులను తిరిగి గాడిలో పెట్టేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారన్నారు.

అందుకు అనుగుణంగా పని చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. లక్షలోపు జనాభా కలిగి ఉన్న మున్సిపాలిటీల్లో అమృత్ ప్రాజెక్టుల పని తీరుపై సమీక్ష నిర్వహిస్తామన్నారు. అమృత్-1 ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం రూ.3362 కోట్లు విడుదల చేస్తే రూ.2,213 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని వెల్లడించారు. అమృత్-2 కింద రూ.8,800 కోట్లు మంజూరు, అయితే కేవలం రూ.3600 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు నాయుడుతో చర్చించి ఈ ప్రాజెక్టుల కోసం రాష్ట్ర వాటా విడుదల చేసి ప్రాజెక్టులను తిరిగి గాడిలో పెట్టేలా చర్యలు తీసుకుంటామన్నారు. జూలై చివరి నాటికి 123 పట్టణ స్థానిక సంస్థల్లో కాలువల్లో పూడిక తీసేందుకు రూ.50 కోట్లు ఖర్చు చేయనున్నట్లు నారాయణ వివరించారు. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు ద్వారా మురుగునీటి ప్రాజెక్టు పూర్తి చేశారని, డిడ్కో ఇళ్లతోపాటు ఒక నెలలో మున్సిపల్ శాఖకు సంబంధించిన అన్ని ప్రాజెక్టుల సమీక్షలు నిర్వహించి 2014-19లో ప్రారంభించిన పనులన్నీ తిరిగి ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు. ఇకపై మున్సిపల్ శాఖలో అభివృద్ధిని పరుగులు పెట్టించనున్నట్లు మంత్రి వెల్లడించారు. గడిచిన ఐదేళ్లలో నిలిచిపోయిన పనులను కూడా తిరిగి ప్రారంభించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అందుకు అవసరమైన అన్ని రకాల చర్యలను తీసుకోనున్నట్లు వెల్లడించార ఇప్పటికే ఆగిపోయిన నిధులను తిరిగి తీసుకువచ్చేందుకు అనుగుణంగా ఏం చేయాలన్న దానిపై ఆలోచనలు చేస్తున్నట్లు వివరించారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్