ఇల్లు లేని నిరుపేదలకు తెలంగాణ ప్రభుత్వం తాజాగా శుభవార్త అందించింది. రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణం పూర్తయి అందుబాటులో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పంపిణీ చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమవుతోంది. తొలి విడతలో ప్రతి నియోజకవర్గానికి 4000 ఇల్లు ఇస్తామని ఇటీవల తెలంగాణ గృహ నిర్మాణ, రెవెన్యూ శాఖ మంత్రి కొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఈ క్రమంలోనే ఆయన అందుకు అనుగుణంగా చర్యలను చేపడుతున్నట్లు తెలుస్తోంది.
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల
తెలంగాణలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీకి ముహూర్తం ఫిక్స్ అయింది. ఇల్లు లేని నిరుపేదలకు తెలంగాణ ప్రభుత్వం తాజాగా శుభవార్త అందించింది. రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణం పూర్తయి అందుబాటులో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పంపిణీ చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమవుతోంది. తొలి విడతలో ప్రతి నియోజకవర్గానికి 4000 ఇల్లు ఇస్తామని ఇటీవల తెలంగాణ గృహ నిర్మాణ, రెవెన్యూ శాఖ మంత్రి కొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఈ క్రమంలోనే ఆయన అందుకు అనుగుణంగా చర్యలను చేపడుతున్నట్లు తెలుస్తోంది. దీపావళి పండగ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా నాలుగువేల డబుల్ బెడ్ రూమ్ ఇల్లు అర్హులైన పేదలకు పంపిణీ చేసేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు మరోసారి మంత్రి వెల్లడించారు. వచ్చే నాలుగేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల డబ్బులు బెడ్ రూమ్ ఇల్లు కట్టించి పేదలకు అందించనున్నట్లు మంత్రి ప్రకటించారు. ఇప్పటికే సిద్ధంగా ఉన్న ఇళ్లను దీపావళి నాటికే లబ్ధిదారులకు అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు మంత్రి ప్రకటించారు. దీంతో లబ్ధిదారులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా హైదరాబాదులోని గోషామహల్ నియోజకవర్గానికి కేటాయించిన 144 మంది డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారులకు పట్టాలను ఆయన పంపిణీ చేశారు. మిగిలిన చోట్ల కూడా ఇదే విధంగా లబ్ధిదారులకు ఆయా ఇళ్లను కేటాయించనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.
తెలంగాణ వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో ప్రస్తుతం ఆరువేల వరకు బెడ్ రూమ్ ఇల్లు సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వ పెద్ద చెబుతున్నారు. వీటిని లబ్ధిదారులకు దీపావళి పండగకు ముందే అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే లబ్ధిదారులను లాటరీ విధానంలో ఎంపిక చేశారు. ఆ లబ్ధిదారులకు ఇంటికి సంబంధించిన పత్రాలను అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అధికారులకు ఈ మేరకు ఆదేశాలను జారీ చేశారు. దీపావళి పండుగను లబ్ధిదారులు కొత్త ఇళ్లల్లో జరుపుకునేలా ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. అందుకు అనుగుణంగానే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ ప్రక్రియను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తమ ప్రభుత్వం 20 లక్షలు మందికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టి ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు మంత్రి పొంగులేటి వెల్లడించారు. రానున్న ఐదేళ్లలో లక్షలాది మందికి ఈ ఇళ్లను అందిస్తామని ఆయన ప్రకటించారు. ఇప్పటికే నిర్మాణాలు పూర్తయి సిద్ధంగా ఉన్న ఇళ్లను పంపిణీ చేసేందుకు అనుగుణంగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో మరో వారం రోజుల్లో వీటిని లబ్ధిదారులకు అందించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి చేతులమీదుగా వీటిని పంపిణీ చేయాలని ఆలోచన చేస్తున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి దీనికి సుముఖత చూపించడం లేదని తెలుస్తోంది. ఆయన నియోజకవర్గాల్లోనే ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు చేతుల మీదుగా పంపిణీ చేయాలని ఆయన సూచిస్తున్నట్లు చెబుతున్నారు. దీనిపై ఇంకా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఒకవేళ పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఒకేచోట పంపిణీ చేయాల్సి ఉంటే భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. అయితే దీనిపై బీఆర్ఎస్ నేతలు మాత్రం విమర్శలు గుప్పిస్తున్నారు. తాము నిర్మించిన ఇళ్లను పంపిణీ చేయడానికి కాంగ్రెస్ పార్టీ హడావిడి దేనికి అంటూ ప్రశ్నిస్తున్నారు.