అమెరికా అధ్యక్షుడు ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. హోరాహోరీ పోరులో ఎవరు గెలుస్తారు అన్న ఊహాగానాల నడుమ ఫలితాలు వెలువడుతున్నాయి. ఉదయం 9 గంటల సమయానికి వచ్చిన ఫలితాలు ప్రకారం చూస్తే ట్రంప్ స్వల్ప ఆదిక్యంలో కొనసాగుతున్నారు. అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఉన్న అభ్యర్థి గెలుపును డిసైడ్ చేసే స్వింగ్ రాష్ట్రాల్లో ట్రంప్ దూసుకెళ్తున్నట్లు తెలుస్తోంది.
కమల హారిస్, ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలు (US Presidential Elections) 2024 ఫలితాల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హవా కొనసాగుతోంది. ప్రస్తుతం ఆయన 20కి పైగా రాష్ట్రాల్లో విక్టరీ సాధించారు. ట్రంప్ ఇప్పటిదాకా 230 ఎలక్టోరల్ సీట్లు (5,36,23,845 ఓట్లు (52.1%)) దక్కించుకున్నారు. అటు.. కమలా హ్యారిస్ 179 ఎలక్టోరల్ సీట్లు (4,78,91,631 ఓట్లు (46.6%)) సాధించారు. ట్రంప్.. మోంటానా, యుటా, నార్త్ డకోటా, వయోమింగ్, సౌత్ డకోటా, నెబ్రాస్కా, ఓక్లహామా, టెక్సస్, ఆర్కాన్సాస్, ఇండియానా, లూసియానా, కెంటకీ, టెన్నెసీ, మిస్సీసిప్పీ, మెస్సోరీ, ఒహాయో, అలబామా, వెస్ట్ వర్జీనియా, సౌత్ కరోలినా, ఫ్లొరిడా రాష్ట్రాలను ట్రంప్ కైవసం చేసుకోగా, కమలా హ్యారిస్.. ఇల్లినాయిస్, న్యూజెర్సీ, మేరీలాండ్, వెర్మాంట్, న్యూయార్క్, కనెక్టికట్, డెలవేర్, మసాచుసెట్స్, రోడ్ ఐలాండ్, కొలరాడో, డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా రాష్ట్రాలను దక్కించుకున్నారు. ప్రస్తుతం ట్రంప్ ముందంజలో కొనసాగుతుండగా, కమల హ్యారిస్ వెనుకంజలో ఉన్నారు. అయితే, ఎన్నికల ఫలితాలు ప్రకటించేందుకు మరో నెల రోజులు పట్టే అవకాశం ఉంది. కాకపోతే.. అక్కడి పరిస్థితిని బట్టి రిజల్ట్ ఎలా ఉంటుందనేది అక్కడి మీడియా సంస్థలు ముందుగానే అంచనా వేసే అవకాశం ఉంది.
ట్రంప్ గెలవాలంటే..
ట్రంప్ మరోసారి అమెరికా అధ్యక్షుడు కావాలంటే.. డెమోక్రటిక్ పార్టీకి మద్దతిచ్చే బ్లూ వాల్ స్టేట్స్‌ను బ్రేక్ చేయాల్సిందేనని రాజకీయ పండితులు పేర్కొంటున్నారు. బ్లూ వాల్ స్టేట్స్ మొత్తం 18 ఉన్నాయి. ఆ రాష్ట్రాల్లో న్యూయార్క్, కాలిఫోర్నియా, మిషిగాన్, ఇల్లినాయిస్, న్యూజెర్సీ, వాషింగ్టన్, మసాచుసెట్స్, మిన్నెసోటా, మసాచుసెట్స్, ఓరెగావ్, విస్కాన్సిన్, కనెక్టికట్, మైనె, హవాయ్, రోడ్ ఐలాండ్, డెలావర్, వెర్మాంట్ ఉన్నాయి. ఇక్కడ మొత్తం 238 ఎలక్టోరల్ ఓట్లు ఉండగా, ట్రంప్ గెలవాలంటే 270 ఎలక్టోరల్ ఓట్లు అవసరం అవుతాయి. బ్లూ వాల్ స్టే్ట్స్‌ను కమల కాపాడుకుంటే.. ఆమె గెలుపు సులభం కానుంది. ఇక, ట్రంప్, కమల దూకుడు ముందు గ్రీన్ పార్టీ తరఫు అభ్యర్థి జిల్ స్టెయిన్, లిబర్టేరియన్ పార్టీ అభ్యర్థి చేజ్ ఓలివర్, స్వతంత్ర అభ్యర్థి రాబర్ట్ కెనెడీ ఒక్క ఎలక్టోరల్ ఓటు కూడా సాధించలేకపోయారు.