రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీ ఓటమిపై మేథోమథనం చేస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ కేడర్ నుంచి పెద్ద ఎత్తున లోపాలను ఎత్తి చూపిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కూడా పార్టీ ఓటమిపై కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా మాజీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి పార్టీ ఓటమిపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
కాసు మహేష్‌రెడ్డి
రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీ ఓటమిపై మేథోమథనం చేస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ కేడర్ నుంచి పెద్ద ఎత్తున లోపాలను ఎత్తి చూపిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కూడా పార్టీ ఓటమిపై కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా మాజీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి పార్టీ ఓటమిపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 2019లో జగన్, 2024లో జగన్ గెలుపునకు ఆయా పార్టీలు కేడర్ కసే కారణమంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమని, విజయమైనా, అపజయమైనా పాజిటివ్‌గా తీసుకోవాలన్నారు. ప్రతిపక్ష పాత్రను హుందగా నిర్వర్తించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు ఆయన తెలిపారు. వైసీపీ ఓడిపోవడానికి ప్రధానంగా మూడు కారణాలు ఉన్నట్టు కార్యకర్తలు తనకు చెప్పారని, వీటిలో నాసిరకం మద్యం ఒకటన్నారు. మద్యం పాలసీని మార్చాలని సజ్జల రామకృష్ణారెడ్డికి, విజయసాయిరెడ్డికి అనేకసార్లు చెప్పినప్పటికీ ఫలితం లేకుండా పోయిందన్నారు. దాని పర్యవసానం ఫలితాల తరువాత కనిపిస్తోందన్నారు. నాసిరకం మద్యాన్ని ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారంటూ టీడీపీ చేసిన ప్రచారాన్ని కూడా ప్రజలు నమ్మారన్నారు. ఇసుక పాలసీ వల్ల పేద వర్గాలు తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు.
ఇసుక మీద ఆధారపడే వాళ్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసినట్టు ఆయన వివరించారు. కార్మికులంతా మెరుగైన ఇసుక పాలసీ తెస్తారన్న ఉద్ధేశంతో టీడీపీకి ఓట్లేశారని వెల్లడించారు. కార్మికులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లో మద్యం, ఇసుక పాలసీ దెబ్బకొట్టినట్టు పేర్కొన్న కాసు మహేష్‌రెడ్డి.. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కూడా వైసీపీని దెబ్బకొట్టిందని పేర్కొన్నారు. జగన్ ఓడిపోవడానికి కొంత మంది నాయకులు నోటి దురుసు కూడా కారణంగా ఆయన వివరించారు. టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చి చంద్రబాబును బూతులు తిట్టారని, ఇలాంటి అవమానాలు చంద్రబాబు, టీడీపీ నాయకుల్లో కసిని పెంచాయన్నారు. టీడీపీ వాళ్లు గెలిచిన తరువాత అనేక చోట్ల దాడులు చేయిస్తున్నారని, వైసీపీ కార్యాలయాన్ని కూల్చివేశారన్నారు.