టీమిండియా ఈ నెలాఖరులో శ్రీలంక పర్యటనకు వెళ్లబోతోంది. ప్రస్తుతం భారత జట్టు జింబాబ్వేలో పర్యటిస్తోంది. ఈ పర్యటన ముగిసిన వెంటనే శ్రీలంక టూర్ కు ఇండియా జట్టు వెళ్లనుంది. ఈ టూర్ లో భాగంగా టీమిండియా ఆతిథ్య శ్రీలంకతో మూడు టి20 మ్యాచ్ లు, మూడు వన్డే క్రికెట్ మ్యాచ్ లు ఆడనుంది. అయితే, ఈ సిరీస్ కోసం భారత జట్టు సరికొత్తగా సన్నద్ధమవుతోంది. అందులో భాగంగానే జట్టులో కొన్ని మార్పులు చేస్తున్నారు.
రోహిత్ శర్మ, బుమ్రా
టీమిండియా ఈ నెలాఖరులో శ్రీలంక పర్యటనకు వెళ్లబోతోంది. ప్రస్తుతం భారత జట్టు జింబాబ్వేలో పర్యటిస్తోంది. ఈ పర్యటన ముగిసిన వెంటనే శ్రీలంక టూర్ కు ఇండియా జట్టు వెళ్లనుంది. ఈ టూర్ లో భాగంగా టీమిండియా ఆతిథ్య శ్రీలంకతో మూడు టి20 మ్యాచ్ లు, మూడు వన్డే క్రికెట్ మ్యాచ్ లు ఆడనుంది. అయితే, ఈ సిరీస్ కోసం భారత జట్టు సరికొత్తగా సన్నద్ధమవుతోంది. అందులో భాగంగానే జట్టులో కొన్ని మార్పులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే బీసీసీఐ సెలక్షన్ కమిటీ రెండు సిరీస్ లకు వేర్వేరు జట్లను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా లంకతో వన్డే సిరీస్ కు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతోపాటు స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. శ్రీలంకతో టి20 సిరీస్ కు హార్దిక్ పాండ్యాకు, వన్డే సిరీస్ లో కె.ఎల్ రాహుల్ కు జట్టు పగ్గాలను అప్పగించాలని అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ యోచిస్తున్నట్టు చెబుతున్నారు. టి20 వరల్డ్ కప్-2024 దూరంగా ఉన్న స్టార్ బ్యాటర్ కెఎల్ రాహుల్ తిరిగి ఈ సిరీస్ తో రీ ఎంట్రీ ఇవ్వనున్నట్టు చెబుతున్నారు.
ప్రస్తుతం టీమిండియా జింబాంబే పర్యటనలో ఉంది. ఈ పర్యటన ముగించుకుని వచ్చిన వెంటనే శ్రీలంక పర్యటనకు వెళ్ళనుంది. ఈ నెల 27న జరగనున్న టి20 మ్యాచ్ తో భారత పర్యటన ప్రారంభమవుతుందని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే శ్రీలంకతో వన్డే సిరీస్ కు సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బుమ్రాకు విశ్రాంతి ఇచ్చేందుకు బీసీసీఐ నిర్ణయించింది. రానున్న రోజుల్లో షెడ్యూల్ దృష్టిలో పెట్టుకుని వీరికి రెస్ట్ ఇచ్చినట్లు చెబుతున్నారు. వీరు ముగ్గురు తిరిగి సెప్టెంబర్ లో బంగ్లాదేశ్ తో జరిగే టెస్ట్ మ్యాక్ కు అందుబాటులోకి వస్తారని బిసిసిఐకి చెందిన ఒక సీనియర్ అధికారి వెల్లడించారు. కాగా, రెండో టి20 వరల్డ్ కప్ విజయం తర్వాత పొట్టి క్రికెట్ కు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించారు.