ఏపీలో కూటమి ప్రభుత్వం గతంలో అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలను మళ్లీ పునః ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే అన్నా క్యాంటీన్ వంటివి ప్రారంభిస్తుండగా.. మరో కీలక నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది. 2014-19 మధ్యకాలంలో అధికారంలో ఉన్న టిడిపి ప్రభుత్వం అప్పట్లో వివిధ వర్గాల కోసం చంద్రన్న కానుకలు పేరుతో కిట్లను అందించింది. వైసీపీ సర్కారు ఈ పథకాన్ని పూర్తిగా నిలిపేసింది. తాజాగా కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని మళ్లీ ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది.
చంద్రన్న కానుకలు
ఏపీలో కూటమి ప్రభుత్వం గతంలో అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలను మళ్లీ పునః ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే అన్నా క్యాంటీన్ వంటివి ప్రారంభిస్తుండగా.. మరో కీలక నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది. 2014-19 మధ్యకాలంలో అధికారంలో ఉన్న టిడిపి ప్రభుత్వం అప్పట్లో వివిధ వర్గాల కోసం చంద్రన్న కానుకలు పేరుతో కిట్లను అందించింది. వైసీపీ సర్కారు ఈ పథకాన్ని పూర్తిగా నిలిపేసింది. తాజాగా కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని మళ్లీ ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ఈ పథకంలో భాగంగా పేదలకు సంక్రాంతి, క్రిస్మస్, రంజాన్ పండుగలను పురస్కరించుకుని కానుకలను అందించనున్నారు. ఈ కానుకల కోసం ఏటా ప్రభుత్వంపై రూ.538 కోట్ల రూపాయల భారం పడనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1.48 కోట్ల రేషన్ కార్డు లబ్ధిదారులు ఉండగా, వీటిలో 90 లక్షల కార్డులకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం గుర్తింపు ఉంది. ఆహార భద్రత చట్టం రాయితీ వీరికి మాత్రమే వర్తిస్తోంది. మిగిలిన 58 లక్షల కార్డుల భారం రాష్ట్ర ప్రభుత్వంపైనే పడుతోంది. చంద్రన్న కానుకల్లో భాగంగా ఒక్కొక్క కిట్టులో అరకిలో కందిపప్పు, అరకిలో శనగపప్పు, అరకిలో బెల్లం, అర లీటర్ పామాయిల్, కిలో గోధుమపిండి, 100 మిల్లీగ్రాముల నెయ్యితో కూడిన కిట్లను కార్డుదారులకు అందించనున్నారు. క్రిస్మస్ కానుక కింద కూడా ఇదే ఇవ్వనున్నారు. ఇక రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలకు రెండు కిలోల చక్కెర, 5 కిలోల గోధుమపిండి, కిలో వర్మిసెల్లి, 100 మిల్లీగ్రాముల నెయ్యితో కూడిన తోఫా కిట్లను ఉచితంగా అందించనున్నారు. గతంలో అందించినట్టుగానే ఈ పథకంలో భాగంగా లబ్ధిదారులకు వాటిని అందించడంతోపాటు అవసరమైతే మరిన్ని సరుకులు యాడ్ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. కొద్దిరోజుల్లోనే ఈ పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
కొత్త కార్డుల పంపిణీ పై విధానపరమైన నిర్ణయం..
రాష్ట్రంలో ప్రస్తుతం 1.48 కోట్ల రేషన్ కార్డులు ఉన్నాయి. వీటిలో 90 లక్షల రేషన్ కార్డులు మాత్రమే బిపిఎల్ కింద ఉన్నట్లు కేంద్రం గుర్తించింది. వీటికి మాత్రమే ఆహార భద్రత చట్టం కింద రాయితీ లభిస్తోంది. మిగిలిన 58 లక్షలకుపైగా కార్డులపై సభ్యులు రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి వస్తోంది. రాష్ట్రంలోని మొత్తం కార్డులను ఆహార భద్రత చట్టం పరిధిలోకి తీసుకు రావాలని రాష్ట్ర ప్రభుత్వం చాలాకాలంగా మొరపెట్టుకుంటున్నా కేంద్రం అంగీకరించడం లేదు. సంబంధం లేకుండా నచ్చిన వారందరికీ కార్డులు ఇచ్చుకుంటూ పోవడం వల్ల రాష్ట్రంలో 90 శాతానికి పైగా ప్రజలు బిపిఎల్ జాబితాలోకి వచ్చేసారని, అంతమందికి రాయితీ ఇవ్వలేమని కేంద్రం తేల్చేసింది. ఇకపోతే రాష్ట్రవ్యాప్తంగా కొత్త కార్డుల కోసం సుమారు 78,000 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. ఇంకా రేషన్ కార్డులో మార్పులు చేర్పుల కోసం మొత్తం 33.36 లక్షలు దరఖాస్తులు ఏడాది కాలంగా పెండింగ్ లో ఉన్నాయి. ఈ పెండింగ్ దరఖాస్తులతోపాటు కొత్తగా పెళ్లయిన దంపతులకు, అన్ని అర్హతలు ఉన్న కుటుంబాలకు కొత్త కార్డులను మంజూరు చేసే అంశంపై కొత్త ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమవుతోంది.