వాలంటీర్లకు మరో షాకిచ్చిన చంద్రబాబు సర్కారు

ఏపీలోని వాలంటీర్లకు కూటమి ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది. ఇప్పటి వరకు వాలంటీర్లకు ఐదు వేలు గౌరవ వేతనంతోపాటు న్యూస్‌ పేపర్‌ అలవెన్స్‌ కూడా ప్రభుత్వం చెల్లిస్తోంది. ఈ మొత్తంతో వాలంటీర్లు సాక్షి పేపర్‌ వేయించుకుంటున్నారు. అయితే, ఈ అలవెన్సును ప్రభుత్వం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రతినెల రూ.200 చొప్పున ఒక్కో వాలంటీర్‌కు అలవెన్సు కింద చెల్లిస్తున్నారు.

Chief Minister Nara Chandrababu Naidu

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు


ఏపీలోని వాలంటీర్లకు కూటమి ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది. ఇప్పటి వరకు వాలంటీర్లకు ఐదు వేలు గౌరవ వేతనంతోపాటు న్యూస్‌ పేపర్‌ అలవెన్స్‌ కూడా ప్రభుత్వం చెల్లిస్తోంది. ఈ మొత్తంతో వాలంటీర్లు సాక్షి పేపర్‌ వేయించుకుంటున్నారు. అయితే, ఈ అలవెన్సును ప్రభుత్వం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రతినెల రూ.200 చొప్పున ఒక్కో వాలంటీర్‌కు అలవెన్సు కింద చెల్లిస్తున్నారు. ఎన్నికల కోడ్‌ వచ్చినప్పటి నుంచి వాలంటీర్లు విధుల్లో లేరు. ఇప్పుడు అధికారికంగా వారికి ఇచ్చే రెండు వందల అలవెన్సులను ప్రభుత్వం రద్దు చేసింది. వాలంటీర్లకు ఇస్తున్న పేపర్‌ అలవెన్స్‌ ఉపసంహరించుకోవాలని ఢిల్లీ హైకోర్టు కొద్దిరోజులు కిందట ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. నెలకు రూ.200 ఇస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవోను ఉషోదయ పబ్లికేషన్స్‌ సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. అడిషినల్‌ ఫైనాన్షియల్‌ సపోర్ట్‌ పేరుతో వాలంటీర్ల ప్లే స్లిప్‌లో రూ.5 వేలకు అదనంగా రూ.200 అలాట్‌ చేశారు. ఏజెంట్‌ ఇచ్చిన పేపరు బిల్లును యాప్‌లో అప్లోడ్‌ చేయాలని వాలంటీర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఇది అక్రమంగా సాక్షి పత్రిక సర్క్యూలేషన్‌ పెంచుకుంటున్నారంటూ ఉషోదయ పబ్లికేషన్స్‌ ఆరోపణలు చేసింది. రూ.200తో సాక్షి పత్రిక మాత్రమే కొనుగోలు చేస్తున్నారని ఆరోపించింది. ఈ కేసులో ఏపీ హైకోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో ఉషోదయ పబ్లికేషన్స్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అనంతరం ఢిల్లీ హైకోర్టుకు సుప్రీం కోర్టు ఈ కేసును బదిలీ చేసింది. సోమవారం వాలంటీర్లపై కేసును ఢిల్లీ హైకోర్టు విచారించింది. రూ.200 చెల్లించే విధానానికి సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వానికి న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. విచారణ తరువాత అలాంటి జీవోలు ఎలా ఇస్తారని, ఉపసంహరించుకోవాలని పేర్కొంది. ఈ క్రమంలోనే ఈ మొత్తం చెల్లింపును నిలిపేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 




సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్