స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌పై సమీక్షించిన పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ను గత పాలకులు గాలికి వదిలేశారని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. బుధవారం అధికారులతో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌పై ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కార్పొరేషన్ గడిచిన ఐదేళ్ల పనితీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.
ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కల్యాణ్
ఏపీ ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కల్యాణ్ పాలనలో జోరు పెంచారు. గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా, పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. అలాగే, కొన్ని కీలకశాఖలను పవన్ కల్యాణ్‌కు చంద్రబాబు అప్పగించారు. బాధ్యతలు చేపట్టిన తరువాత జోరు పెంచిన పవన్ కల్యాణ్‌కు తనకు అప్పగించిన పలు శాఖలపై సమీక్షలు నిర్వహిస్తూ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేస్తున్నారు. బుధవారం కూడా తన పరిధిలోని మరో శాఖపై సమీక్ష నిర్వహించారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌పై సమీక్షించిన పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ను గత పాలకులు గాలికి వదిలేశారని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. బుధవారం అధికారులతో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌పై ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన కార్పొరేషన్ గడిచిన ఐదేళ్ల పనితీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌లో కేవలం రూ.7 కోట్లు మాత్రమే మిగిల్చారన్న పవన్ కల్యాణ్.. ఐదు నెలలు జీతాలకు మాత్రమే వస్తాయన్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.2092 కోట్లు నిధులుండేవని, ప్రస్తుతం ఏడు కోట్లు మాత్రమే ఉన్నాయన్నారు. ఈ దుస్థితికి ఎందుకు వచ్చిందని ఆయన అధికారులను ప్రశ్నించారు. నిధుల మళ్లింపునకు సంబంధించి వివరణ ఇవ్వాలని ఆయన అధికారులను కోరారు. వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నిధుల మళ్లింపుపై మరింత లోతుగా సమీక్షించేందుకు పవన్ కల్యాణ్ సిద్ధమవుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నిధులు దుర్వినియోగం అయ్యాయన్న భావనను పవన్ కల్యాణ్ వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అధికారులతో పవన్ కల్యాణ్ సీరియస్‌గా మాట్లాడినట్టు తెలిసింది. ప్రభుత్వ అధికారులు కనీసం బాధ్యతతో వ్యవహరించాలని అధికారులు సూచించినట్టు చెబుతున్నారు. నిధులు మళ్లింపునకు సంబంధించి అడ్డగోలుగా గత పాలకులు నిర్ణయాలు తీసుకున్నట్టు పవన్ కల్యాణ్ భావిస్తున్నారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నిధులను ఏయే శాఖలకు బదలాయించారు, వాటితో ఎటువంటి పనులు చేపట్టారన్న దానిపై పవన్ కూలంకుషంగా వివరాలను తెలుసుకునే పనిలో పడినట్టు చెబుతున్నారు.