ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి నడుచుకుంటూ అసెంబ్లీకి వచ్చారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలను నిరసిస్తూ నల్ల కండువాలు ధరించి జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ర్యాలీగా నడుచుకుంటూ అసెంబ్లీకి వచ్చారు.
పోలీసులతో వాగ్వాదం ఆడుతున్న జగన్
ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి నడుచుకుంటూ అసెంబ్లీకి వచ్చారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలను నిరసిస్తూ నల్ల కండువాలు ధరించి జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ర్యాలీగా నడుచుకుంటూ అసెంబ్లీకి వచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన కొద్దిరోజులుగా జరిగిన దాడులకు సంబంధించిన ప్లకార్డులను ప్రదర్శిస్తూ వచ్చారు. అయితే, పలువురు పోలీసులు ఈ ప్లకార్డులు తీసుకుని చింపివేయడం పట్ల జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ గేటు వద్ద పోలీసులు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అడ్డుకోవడంతో వారంతా తీవ్ర వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలోనే ప్లకార్డులను లాగేసి చించి వేయడం పట్ల జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్లకార్డులను చించి వేసే అధికారం ఎవరు ఇచ్చారంటూ ఈ సందర్భంగా జగన్ పోలీసులను ప్రశ్నించారు.
అధికారం ఎవరికి శాశ్వతం కాదని స్పష్టం చేశారు. పోలీసులు ఉన్నది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడానికి కాదని, ప్రజాస్వామ్యాన్ని కాపాడటం ముఖ్యమన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని, పోలీసుల వైఖరి ఎంతో దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. చట్ట ప్రకారం పోలీసులు పని చేయాలంటూ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఓ పోలీసు ఉన్నతాధికారి పట్ల జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అసెంబ్లీ గేటు వద్ద కాసేపు ఉద్రిక్తత నెలకొంది. అనంతరం పోలీసులు సభ్యులను లోపలికి అనుమతించారు. అసెంబ్లీలోకి వెళ్ళిన తర్వాత గవర్నర్ ప్రసంగం సమయంలో హత్య రాజకీయాల నశించాలి అంటూ వైసిపి సభ్యులు నినాదాలు చేశారు. అయినా, గవర్నర్ ప్రసంగం కొనసాగడంతో నిరసనగా వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం గవర్నర్ ప్రసంగం ముగియడంతో సభ రేపటికి వాయిదా పడింది. కాసేపట్లో స్పీకర్ అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది ఈ భేటీలో నిర్వహించనున్నారు.