సిద్దిపేటలో ఉద్రిక్త పరిస్థితులు.. మాజీమంత్రి హరీష్ రావు ఆఫీస్ పై దాడి

తెలంగాణలో రాజకీయ పరిస్థితులలో ఉద్రిక్తంగా మారుతున్నాయి. రెండు రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావు మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. విమర్శ, ప్రతి విమర్శలతో ఇద్దరు నేతలు రాజకీయంగా వేడిని పెంచారు. ఈ నేపథ్యంలో సిద్దిపేట పట్టణంలో శనివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శుక్రవారం అర్ధరాత్రి ఎమ్మెల్యే హరీష్ రావు క్యాంపు ఆఫీస్ పై దాడి జరిగింది.

Harish camp office attacked by Congress

హరీష్ క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి

తెలంగాణలో రాజకీయ పరిస్థితులలో ఉద్రిక్తంగా మారుతున్నాయి. రెండు రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావు మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. విమర్శ, ప్రతి విమర్శలతో ఇద్దరు నేతలు రాజకీయంగా వేడిని పెంచారు. ఈ నేపథ్యంలో సిద్దిపేట పట్టణంలో శనివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శుక్రవారం అర్ధరాత్రి ఎమ్మెల్యే హరీష్ రావు క్యాంపు ఆఫీస్ పై దాడి జరిగింది. ఈ ఘటన ప్రస్తుతం కలకలం సృష్టిస్తోంది. దాడిని నిరసిస్తూ క్యాంప్ ఆఫీసు ముందు బీఆర్ఎస్ శ్రేణులు ధర్నాకు దిగాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య గొడవ హై టెన్షన్ కు దారితీసింది. ఈ నేపథ్యంలో పట్టణంలోని పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎటువంటి గొడవలకు దారి తీయకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ వ్యవహారంపై మాజీమంత్రి హరీష్ రావు స్పందించారు.

అర్ధరాత్రి వేళ కాంగ్రెస్ గూండాలు దాడి చేసి, తాళాలు పగలగొట్టి ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేయడం దారుణమని హరీష్ రావు ట్విట్టర్ వేదికగా ఆరోపించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పై దాడిని అడ్డుకోవాల్సిన పోలీసులే దుండగులను రక్షించడం శోచనీయమని విమర్శించారు ఒక ఎమ్మెల్యే నివాసంపైనే ఇంత దారుణంగా దాడి జరిగిందంటే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. పోలీసుల సమక్షంలో ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం కాంగ్రెస్ మార్కు పాలనకు నిదర్శనమని, వెంటనే ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని డిజిపిని హరీష్ రావు డిమాండ్ చేశారు. దాడికి పాల్పడిన పలువురు క్యాంపు కార్యాలయంలో ఉన్న బీఆర్ఎస్ ప్లెక్సీ ని చించివేశారు. ఈ సందర్భంగా వారంతా హరీష్ రావు రాజీనామా చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం  హరీష్ రావు క్యాంపు కార్యాలయానికి చేరుకున్న టిఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించారు. సిద్దిపేట పట్టణంలోని అనేక ప్రాంతాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలను బీఆర్ఎస్ శ్రేణులు తొలగించి వేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకున్నారు. పలువురిని అరెస్టు చేసి పోలీసులు పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ వ్యవహారం ఎక్కడికి దారితీస్తుందో అన్న ఉద్దేశంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎమ్మెల్యే హరీష్ రావు క్యాంపు కార్యాలయం వద్ద భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్