తెలంగాణ కొత్త అసెంబ్లీకి 10 మంది మహిళలు.. గత అసెంబ్లీలో ఎందరున్నారంటే..

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||సీతక్క, యశస్విని రెడ్డి||

(రంగారెడ్డి, ఈవార్తలు ప్రతినిధి, అక్కినేపల్లి పురుషోత్తమరావు)

తెలంగాణ అసెంబ్లీకి మొత్తం పది మంది మహిళలు ఎన్నికయ్యారు. వాస్తవానికి ఎన్నికల్లో 30 మంది మహిళలు పోటీ చేయగా, పదిమంది విజయం సాధించారు. వీరంతా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినవారే. రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం నుండి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మెదక్ జిల్లా నరసాపూర్ నుంచి మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి భారత రాష్ట్ర సమితి తరపున పోటీ చేసి గెలుపొందారు. ములుగు అసెంబ్లీ నియోజకవర్గం నుండి ధనసరి అనసూయ అలియాస్ సీతక్క, వరంగల్ తూర్పు నియోజకవర్గం నుండి కొండా సురేఖ, కోదాడ నియోజకవర్గం నుంచి ఉత్తమ్ పద్మావతి, సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి లాస్య నందిత (బీఆర్ఎస్), ఆసిఫాబాద్ నియోజకవర్గం నుంచి కోవా లక్ష్మి (బీఆర్ఎస్), నారాయణపేట నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా చిట్టెం పర్ణిక రెడ్డి గెలుపొందారు. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ తరఫున మామిడాల యశస్వినిరెడ్డి, సత్తుపల్లి నియోజకవర్గం నుంచి మట్టా రాగమయి పోటీ చేసి గెలిచారు. కాగా, గత అసెంబ్లీలో ఆరుగురు ఎమ్మెల్యేలే ఉన్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్