రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, రేవంత్ రెడ్డి భేటీ ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో వీరిద్దరు భేటీ అయ్యారు.
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు (File Photo)
హైదరాబాద్, ఈవార్తలు: రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, రేవంత్ రెడ్డి భేటీ ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో వీరిద్దరు భేటీ అయ్యారు. ఈ భేటీలో తెలంగాణ నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, సీఎస్ శాంతికుమారి, సీనియర్ అధికారులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు, మంత్రులు కందుల దుర్గేష్, సత్యప్రసాద్, బీసీ జనార్ధన్ రెడ్డి, సీఎస్, మరో ఇద్దరు అధికారులు హాజరయ్యారు.
రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న విభజన సమస్యలపై ఈ భేటీలో చర్చించనున్నారు. ముఖ్యంగా తెలంగాణ పలు డిమాండ్లను ఏపీ ముందు.. ఏపీ కూడా పలు డిమాండ్లను తెలంగాణ ముందు ఉంచనున్నది. ఇరు రాష్ట్రాలు సమన్వయంతో, రెండు రాష్ట్రాల పురోభివృద్ధికి దోహదం చేసేలా చర్చలు కొనసాగనున్నాయి.